London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ఎల్-నినో వల్ల..మే వరకూ అసాధారణ ఎండలు : ఐరాస హెచ్చరిక

గతేడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏ నెలకు ఆ నెలలో అధిక ఎండలు వందేళ్ల రికార్డులను తిరగ రాశాయి. పారిశ్రామికీకరణ మొదలైన తర్వాత ఇంతటి స్థాయిలో వేడి వాతావరణం నమోదుకావడం ఇదే మొదటిసారి. దీనికి కారణం పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో కారణం. కానీ, ఇంతగా వేడెక్కడానికి కార్బన్ ఉద్గారాలు కూడా ఓ చేయి వేశాయని, గ్రీన్ హౌస్ వాయువులను అదుపు చేయకుంటే చాలా ఇబ్బంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిసెంబరులో గరిష్టానికి చేరుకున్న ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన ఐదు బలమైన వాటిలో ఒకటి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దీని ప్రభావం వల్ల మే వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఎల్ నినో క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలో చిక్కుకున్న వేడిని పెంచుతున్నాయని, దాని ప్రభావం రాబోయే నెలల్లో కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. అందువల్ల మార్చి నుంచి మే మధ్య దాదాపు అన్ని భూభాగాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయి అని మంగళవారం విడుదల చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ త్రైమాసిక నివేదికలో పేర్కొంది. ఎల్ నినో వల్ల మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెద్ద-స్థాయిలో వేడెక్కడం, ఇది బలపడిన తర్వాత సాధారణంగా ప్రపంచ వాతావరణంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇది సహజంగా సంభవించే వాతావరణ పరిణామం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల, అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరువు, ఇతర చోట్ల భారీ వర్షాలకు కారణమవుతుంది. ఇది సగటున ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు సంభవిస్తుంది. సాధారణంగా తొమ్మిది నుంచి 12 నెలల వరకు ఉంటుంది. అలాగే, ఎల్ నినో, దీనికి వ్యతిరేకంగా చల్లగా ఉండే లా నినాకు మధ్య పరిస్థితులు తటస్థంగా ఉంటాయి.

ఆందోళనకరంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు
మార్చి-మే మధ్య ఎల్‌నినో కొనసాగే అవకాశం 60 శాతం కాగా.. ఏప్రిల్‌ నుంచి జూన్‌లో 80 శాతం తటస్థ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది్ణ అని ఔవీూ తెలిపింది. ఏడాది తర్వాత లా నినా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, కానీ, దీనిపై ప్రస్తుతం అనిశ్చితి ఉందని పేర్కొంది. ఎల్ నినో ప్రభావంతో ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని డబ్ల్యూఎంవో చీఫ్ సెలెస్టే సౌలో తెలిపారు. ాకానీ మానవ కార్యకలాపాల వల్ల వాతావరణం మారుతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది్ణ అని వ్యాఖ్యానించారు.

కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఈ మూడు ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు ప్రధానంగా కారణమని సౌలో చెప్పారు. ాజూన్ 2023 నుంచి ప్రతి నెలా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. 2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది్ణ అని ఆమె వివరించారు. ాఎల్ నినో ఈ రికార్డు ఉష్ణోగ్రతలకు దోహదపడింది… అయితే దీనికి నిస్సందేహంగా గ్రీన్‌హౌస్ వాయువులే కారణం్ణ అని అన్నారు.

ఈక్వటోరియల్ పసిఫిక్‌లోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్ నినోను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.. అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత 10 నెలలుగా స్థిరంగా, అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయి్ణ అని సౌలో వివరించారు. ాజనవరి 2024లో సముద్ర-ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. ఇది ఆందోళన కలిగించేది.. దీనికి ఎల్ నినో మాత్రమే కారణం కాదు్ణ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

రికార్డు స్థాయిలో వేడి
ప్రస్తుత ఎల్ నినో జూన్ 2023లో అభివృద్ధి చెందింది.. నవంబర్- జనవరి మధ్య అత్యంత బలంగా ఉంది. తూర్పు, మధ్య ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో 1991 నుంచి 2020 మధ్య సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కంటే దాదాపు 2.0 డిగ్రీల సెల్సియస్ (3.6 డిగ్రీల ఫారెన్‌హీట్) గరిష్ట స్థాయిని తాకింది.. ఇది ఐదు బలమైన ఎల్ నినో సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఎల్ నినో సాధారణంగా దక్షిణ అమెరికా, యూఎస్ దక్షిణ భాగం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెరిగిన వర్షపాతంతో సంబంధం ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, మధ్య అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలో కూడా తీవ్రమైన కరువులను కలిగిస్తుంది.. చివరి ఎల్ నినో 2015-2016లో సంభవించిందని ఔవీూ తెలిపింది.

అలాగే, 2020 నుంచి 2023 ప్రథమార్థం వరకూ దాదాపు మూడేళ్లు లా నినా కొనసాగింది. ట్రిపుల్-డిప్ లా నినా అని పిలవబడే ఇది ఇది 21వ శతాబ్దంలో మొదటిది. 1950 నుంచి మూడోది మాత్రమే. కానీ దాని శీతల వాతావరణ ప్రభావాలు 2015 నుంచి తొమ్మిదేళ్లు రికార్డుస్థాయిలో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలను నిలువరించలేదు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలని ఔవీూ కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img