Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎస్‌బీఐకి మొట్టికాయ

. నేటి సాయంత్రంలోగా వివరాలు ఇవ్వండి
. ఎన్నికల బాండ్లపై ఎస్‌బీఐకు సుప్రీం ఆదేశాలు
. 26 రోజులుగా ఏం చేశారని ప్రశ్న

న్యూదిల్లీ: ఎన్నికల బాండ్ల కేసులో భారతీయ స్టేట్‌ బ్యాం కు (ఎస్‌బీఐ) కి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి బ్యాంకు అదనపు సమయం కోరడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడా నికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, వివరాలను వెల్లడిరచడానికి జూన్‌ 30 వరకు సమయాన్ని పొడిగించాలని కోరుతూ బ్యాంకు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ, మార్చి 12న పని వేళలు ముగిసేలోగా ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడిరచాలని ఆదేశించింది. బ్యాంకు వివరాలు సమర్పించడంలో విఫలమైతే, ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి నందుకు సుప్రీం కోర్టు దానిపై విచారణకు మొగ్గు చూపవచ్చని ఎస్‌బీఐని హెచ్చరించింది. అలాగే, మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు బ్యాంక్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పంచుకున్న వివరాలను ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, బి.ఆర్‌.గవాయ్‌, జె.బి.పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 15న వెలువరించిన చారిత్రక తీర్పులో, అదే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అనామక రాజకీయ నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద ఎన్నికల బాండ్ల పథకాన్ని ‘రాజ్యాంగ విరుద్ధం’ అని పేర్కొంటూ రద్దు చేసింది. మార్చి 13లోపు దాతలు, వారి విరాళంగా ఇచ్చిన మొత్తం, గ్రహీతల వివరాలను ఈసీ ద్వారా వెల్లడిరచాలని స్పష్టం చేసింది. పథకాన్ని రద్దు చేయాలని ఆదేశిస్తూ, 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఈ పథకం కింద అధీకృత ఆర్థిక సంస్థ అయిన ఎస్‌బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఎస్‌బీఐపై ధిక్కార చర్య తీసుకోవాలంటూ దాఖలయిన వేర్వేరు పిటిషన్లను కూడా ధర్మాసనం విచారిస్తోంది. దరఖాస్తులో ఎస్‌బీఐ సమర్పణలు కోర్టు ద్వారా బహిర్గతం చేయాలని సూచించిన సమాచారం తక్షణమే అందుబాటులో ఉందని న్యాయస్థానం పేర్కొంది. ‘అందువల్ల జూన్‌ 30 వరకు ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడానికి సమయాన్ని పొడిగించాలని కోరుతూ ఎస్‌బీఐ దాఖలు చేసిన ఇతర దరఖాస్తును తోసిపుచ్చడం జరిగింది’ అని పేర్కొంది. ‘మార్చి 12న పని వేళలు ముగిసేలోగా ఆ వివరాలను సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించాం’ అని పేర్కొంటూ, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి, మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఈసీఐ ఆ సమాచారాన్ని సంకలనం చేసి వివరాలను దాని అధికారిక వెబ్‌సైట్‌లో తర్వాత ప్రచురించాలని మేము నిర్దేశిస్తున్నాము. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌బీఐ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తారు’ అని ధర్మాసనం తెలిపింది. విచారణ సందర్భంగా ఎస్‌బీఐ తరపు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలను పరిగణనలోకి తీసుకుంది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని, వాటిని సరిపోల్చి వివరాలను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని, ఆ కసరత్తును బ్యాంకు కనీసం మూడు వారాల్లో పూర్తి చేయగలదని తెలిపారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేస్తున్నప్పుడు, బ్యాంకు సమాచారాన్ని విభజించి, పేర్లను ఒక చోట ఉంచగా, కొనుగోలుదారు రికార్డు మరొక స్థలంలో ఉందని సాల్వే చెప్పారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నా మాట్లాడుతూ, కొనుగోలుదారుల వివరాలన్నీ బ్యాంకు ప్రధాన శాఖలో సీల్డ్‌ కవర్‌లో ఉన్నాయని పిటిషన్‌లోని 10వ పేరా ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలిపారు. ‘మీరు సీల్డ్‌ కవర్‌ని తెరిచి వివరాలు ఇవ్వాలి’ అని ఆదేశించారు. ‘గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడిరచాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. ఏ దాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను సరిపోల్చి మేం చెప్పమనలేదు. ఎన్ని బాండ్లను జారీ చేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్లుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించాం. గత 26 రోజులుగా దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఆ సమాచారమేదీ మీరు చెప్పలేదు’ అని పేర్కొంది. ఎస్‌బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రాజ్యాంగ ధర్మాసనం ఆదేశంపై సవరణ కోసం చేసిన దరఖాస్తుకు మద్దతుగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘మీరు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాన్ని సవరించాలని కోరడం చాలా తీవ్రమైన విషయం’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. దాత ద్వారా దావా వేయవచ్చు, అందువల్ల బ్యాంక్‌ ఇందులో తప్పు చేయదని న్యాయవాది సాల్వే చెప్పినప్పుడు, న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ ఇలా వ్యాఖ్యానించారు. ‘మీరు ఏం చేసినా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే చేస్తున్నారు. మీపై దావా వేసిన ప్రశ్న ఎక్కడ ఉంది’ అని అన్నారు. కోర్టు ఫిబ్రవరి 15 ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకు నిలిపివేసిందని సాల్వే ప్రారంభంలోనే చెప్పారు. రెండు శాఖలతో ముడిపడిన ఈ సమాచారాన్ని క్రోడీకరించి, వివరాలను సమర్పించడానికి చేసే కసరత్తుకు కొంత సమయం అవసరమని ఎస్‌బీఐ తన దరఖాస్తులో పేర్కొంది. అయితే మార్చి 12 సాయంత్రం పనిగంటలు ముగిసేలోగా దాతల వివరాలను మీరు ఈసీకి అందజేయాల్సిందే’ అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను బహిర్గతపర్చాలని ఈసీకి సూచించింది. కాగా, సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్ష నాయకులు ప్రశంసించారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఎవరు ఏ పార్టీకి విరాళాలు ఇచ్చారో త్వరలో దేశానికి తెలుస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img