Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

క్షయ వ్యాధి నివారణపైఅవగాహన ర్యాలీ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఆధ్వర్యంలో వైద్య శాఖ కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. 24 న “”ప్రపంచ క్షయ వ్యాధి దినం ” సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… క్షయ వ్యాధి నిర్మూలన కొరకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి క్షయ వ్యాధి నిర్ములన కోసం అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలలో క్షయ వ్యాధిపై ఉన్న అనుమానాలు ,అపోహాలు, భయాలను ,పోగొట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్మూలన కోసం అందించే వైద్య సేవలు.పారితోషికం మొదలగు సౌకర్యాలను గూర్చి వ్యాధిగ్రస్తులకు తెలియపరచాలన్నారు. ప్రభుత్వాసుపత్రులందు ఉచిత మందులు పరీక్షలు అందించబడుతుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎవరికైనా క్షయ వ్యాధి లక్షణాలు అయినా రెండు వారాలకు మించి దగ్గు ఉండడం, గళ్ళపడడం, జ్వరము , బరువు తగ్గటం ,ఆకలి మందగించడం, ఉమ్మిలో రక్తం పడడం మొదలగు లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే ప్రభుత్వాసుపత్రిలోని డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారించుకున్న తర్వాత ఉచిత మందులు అందించబడతాయని తెలిపారు, అధునాతనమైన సిబి నాట్ మరియు ఆర్టిపిసిఆర్ తో పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యక్ష పర్యవేక్షణలో డాట్స్ ద్వారా మందులు అందించబడుతుందని తెలిపారు ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తునికి మందులు మింగించిన పర్యవేక్షకులకు వెయ్యి రూపాయలు అందించబడుతుందని తెలిపారు అలాగే క్షయ వ్యాధిగ్రస్తులకు కూడా నెలకు 500 రూపాయలు ప్రకారం ,ప్రజలలోని క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించిన వారికి 500 పారితోషికము, ప్రైవేటు వైద్యులు వ్యాధిగ్రస్తుని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపినందుకు 500 పారితోషకము అందించబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్. పాల్ రవికుమార్ ,జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీవీ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుజాత ,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబులు ,ఆర్డిటి సమస్త హెల్త్ డైరెక్టర్ సిరప్ప ,పలమనాలజిస్ట్ డాక్టర్ సుధింద్ర, , డిప్యూటీ డెమో త్యాగరాజు, ఆరోగ్య బోధనా అధికారి గంగాధర్ , క్షయ విభాగం సిబ్బంది శ్రావణి, మహేష్, నాగమణి ,ఓబిరెడ్డి ,చంద్రమోహన్ శ్రీధర్ బాబు ,శ్రీనివాస్ రెడ్డి, హెఛ్ ఈ ఓ. సత్యనారాయణ ,హెఛ్ ఈ వెంకటేష్. మొదలగువారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img