Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిఎంఆర్ ఐటీ లో 26వ వార్షికోత్సవం వేడుకలు

విశాలాంధ్ర- రాజాం : స్థానిక జి. ఎం.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ 26 వ వార్షికోత్సవ వేడుకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీమతి వసంత, వైస్ ప్రెసిడెంట్, క్యాప్ జెమిని, బెంగుళూరు (జిఎంఆర్ ఐటి పూర్వ విద్యార్థిని) మాట్లాడుతూ మన కళాశాల బెంగుళూరు ఐఐఎస్సి లాగా వుందని. ఇక్కడ నేర్చుకున్న అంశాలను నిత్యజీవితంలో అనేక సార్లు ఉపయోగిస్తున్నానని చెప్పారు. విద్యార్థులు మంచి మూర్తిమత్వం తో ప్రపంచాన్ని జయించగలరని విద్య తో పాటు కమ్యునికేషన్ స్కిల్స్, స్వభావం, వినయం మరియు సమయపాలన ద్వారా విజయం సాధించవచ్చునని, శ్రమ తప్ప విజయానికి అడ్డుదారి లేదని బోధించారు.
మరో అతిథిగా విచ్చేసిన శ్రీమతి అశ్వథీ వేణుగోపాల్, హెడ్ అఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ రిలేషన్స్ ,కాగ్నిజెంట్, బెంగుళూరు మాట్లాడుతూ జిఎంఆర్ ఐటి భారతీయ మౌలిక విలువలు ఆధునిక విద్యల మేలు కలయిక గా వర్ణించారు. 2047 కల్లా భారత్ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగడానికి మన మంతా క్రుషి చేయాలని కోరారు. మన నిత్య జీవితంలో సాంకేతికత వినియోగం కృత్రిమ మేధ వాడకం పెరిగిందని అందువల్ల మనమంతా కొత్తగా వచ్చిన వాటిని నేర్చుకుని నాయకత్వ లక్షణాలు పెంచుకుని తమదైన శైలి గుర్తింపు సాధించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.
జిఎంఆర్ బిఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ గిరీశ్ మాట్లాడుతూ రాజాం గ్రూప్ ఛైర్మన్ జి ఎం ఆర్ పుట్టిన ఊరు కావడంతో ఆయన పలు విద్యా సంస్థల ఏర్పాటు చేసి పదివేల మంది పైగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నారని చెప్తూ ప్రతి సంవత్సరం 5గురు ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పారిస్ లోని ఏ డీ పీ సంస్థ లో ఇంటెర్న్షిప్ ఏర్పాటు చేశారని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిఎల్విఆర్ఎస్వి ప్రసాద్ తన వార్షిక నివేదికలో కళాశాల జాతీయ స్థాయిలో ఉత్తమ గుర్తింపు పొంది పలు ఉన్నత విద్యాసంస్థలు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుందని విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారని అధ్యాపకుల బోధనతో పాటు పరిశోధనారంగంలో రాణి ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులు గేట్ లో నాణ్యమైన ర్యాంకులు సాధించిన విషయం సభకు తెలిపారు. కార్యక్రమంలో తొలుత వార్షికోత్సవ సంయోజకులు డాక్టర్ ఎం.వీ. నాగేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు.
అనంతరం వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ చూపిన అధ్యాపకులకు అవార్డులు, విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img