Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అవగాహనతోనే క్షయ వ్యాధి అంతం

క్షయ వ్యాధి ఎన్ఓటిసి లక్ష్మీకాంత్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- క్షయ వ్యాధిని అవగాహనతోనే అంతమొందించగలమని ఆ వ్యాధి ఎం ఓ టి సి, లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లక్ష్మీకాంత్ అన్నారు. జాతీయ క్షయ వ్యాధి దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సామాజిక ప్రాంతీయ ఆసుపత్రిలో క్షయ వ్యాధి సూపర్వైజర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన తోటి వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి క్షయ వ్యాధి నిర్మూలనను పురస్కరించుకొని ముందుగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేని దగ్గు, విడవకుండా వచ్చే జ్వరం, ఆకలి మందగించడం, విపరీతమైన కళ్ళే రావడం, రోజురోజుకు శక్తి క్షీణించడం క్షయ వ్యాధి లక్షణాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రం తో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించి క్షయ వ్యాధితో పాటు ఇతర రుగ్మతల నుంచి దూరంగా ఉండాలని, క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రులలో మెరుగైన వైద్యం పొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆర్ వి నగర్ వైద్యాధికారులు సౌమ్య, రాజా రవీంద్ర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img