Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పరాకాష్టకు చేరిన భూ అక్రమాలు..

భూదాహానికి కుటుంబం బలి
50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్.. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: పరాకాష్టకు చేరిన భూ ఆక్రమాలు అరికట్టే వారు లేరని, భూదాహానికి ధర్మవరం కు చెందిన కుటుంబం బలి కావడం చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ కడప జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని మాధవరం వీవర్స్ కాలనీలో జరిగిన దుర్ఘటన యావత్ రాష్ట్ర ప్రజలను విష్మయానికి గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేతి మగ్గం ద్వారా జీవనం గడుపుతున్న పాలెం సుబ్బారావు కుటుంబం ముక్కుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన ఎంతో బాధను కలిగిస్తూ విష్మయానికి గురి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం బాధాకరమని, సుబ్బారావు పూర్వీకులు సంపాదించిన భూమిని వారికి తెలియకుండా కట్టా శ్రావణి పేరుతో ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల భూమి కబ్జాకు గురి అయిందన్న విషయమును తెలుసుకున్న సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. దీనికి అధికారపక్ష నాయకులు రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు కారకులైన రెవెన్యూ అధికారులపై, అధికార పక్ష నాయకులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణం వారి కుటుంబ వారసులకు వారి భూమిని స్వాధీనం చేసి మృతులకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చేనేత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పరిగణలోనికి తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత కార్మిక సంఘాలను ఐక్యం చేసి మృతి చెందిన వారి కుటుంబానికి అండగా నిలబెడతామని తెలిపారు. కడప జిల్లా మొత్తం భూకబ్జాలు పెరిగిపోయాయి అని తెలిపారు. ఈ భూ కబ్జాలకు అధికారులు సహకరిస్తున్న కారణంగానే విచ్చలవిడిగా కబ్జాలు జరుగుతున్నాయని, ఆ కబ్జాలను పోరాటాల ద్వారా ఆపుతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img