Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి

ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు ఓటర్ తప్ప ఎవరు వెళ్ళకూడదు

సుమారు 12 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతారు…జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

విశాలాంధ్ర -ధర్మవరం : ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసు కోవాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు ఓటరు తప్ప మరెవ్వరు కూడా వెళ్లకూడదని, ఎన్నికల విధులకు సుమారు 12000 మంది సిబ్బంది హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డిఓ సమావేశ భవనంలో ఏర్పాటుచేసిన పిఓ, ఓపిఓ శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో వెంకట శివరామి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ ,నియోజవర్గ సంబంధించిన ఎమ్మార్వోలు, ట్రైనీలు రాంప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది సిబ్బందిని నియమించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రతి అంశాన్ని పై మంచి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఇటువంటి శిక్షణ తరగతులు ఎలాంటి సందేహాలు ఉన్న మీరు తెలుసుకోవచ్చని తెలిపారు, ఇంకా రెండు ,మూడు శిక్షణ తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు , లోకసభకు ప్రత్యేకంగా, అసెంబ్లీకి ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల కమిషన్ ప్రతి ఎలక్షన్లకు ప్రత్యేక పుస్తకాలు అందజేస్తూ ఉన్నదని వాటిని సమగ్రంగా చదివి మంచి పట్టు సాధించాలని తెలిపారు. పిఓ హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకోవాలి అని, చట్టాల గురించి, అన్ని రకాల ఫారాల గురించి తెలుసుకోవాలి అని తెలిపారు. పోలింగ్కు ఏడు రోజులు ముందు ఫారం 12 లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయా లన్నారు. అది ఈ డి సి కోసం అయితే 12 A ఫస్ట్ చేసుకోవా లన్నారు. పోలింగ్ ముందు రోజు ధర్మవరం మార్కెట్ యార్డ్ నందు నియోజకవర్గానికి సంబంధించిన ప్రెసిడెంట్ అధికారులు తో పాటు సహాయ ప్రెసిడెంట్ అధికారులు, ఓపిఓలు ఆయా పోలింగ్ స్టేషన్లకు విధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మీకు ఎలాంటి సమస్య వచ్చినా రూట్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి అని తెలిపారు.పి ఓ డైరీ రాయాలి, ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం నమోదు చేయా నన్నారు. మాకు పోల్
90 నిమిషాల ముందే స్టార్ట్ చేయా లని, మాక్ పోల్ సమయంలో ఇద్దరు అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా ఉండా లన్నారు. అయితే కనీసం ఇద్దరు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు హాజరు కాకపోతే పది నిమిషాలు వేచి చూసి, అప్పటికి ఏజెంట్లు రాకపోతే ప్రెసిడెంట్ అధికారి మైక్రో అబ్జర్వర్, పోలింగ్ అధికారుల సమక్షంలో మాకు పోల్ ప్రారంభించవచ్చు నని తెలిపారు.
ఉదయం 5:45 గంటలకు ప్రారంభించా లని, మే 13వ తేదీన ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణ ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముందు రోజు పీ వోలు ,ఏపీవోలు, ఎన్నికల మెటీరియర్లు తీసుకోవాలన్నారు. అదే మెటీరియర్లతో తిరిగి అప్పగించాలని, ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక బందోబస్తు ద్వారా ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బందిని చేర్చడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఎవరు సెల్ ఫోన్లు వాడకూడ దని,17 సి ఫారం తప్పులు లేకుండా ప్రదర్శించాలని, ఆయా పోలింగ్ స్టేషన్లో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. టెండర్ ఓటు, మాకు పోల్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటరు అనధికారిగా ఇచ్చిన ఓటర్ స్లిప్ తో వస్తే, ఎలక్షన్ కమిషన్ చెప్పిన సమయానికి పోలింగ్ ముగించా లన్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అప్పటికే వరుసలో ఓటర్ ఉంటే, వరుసలోని చివరి ఓటరుకు ఒకటో నెంబర్ స్లిప్ టోకన్ ఇవ్వా లని, మొదటి వ్యక్తికి చివర అంకె స్లిప్పును ఇవ్వా లని తెలిపారు.17 సి లో అనగా రికార్డులైన ఓట్ల గురించి రాశి, సంతకం చేయా లని, పోలింగ్ ఏజెంట్లతో సంతకాలు తప్పనిసరిగా చేయించాలన్నారు. పోలింగ్ స్టేషన్ నమూనా లేఅవుట్ ప్రకారమే పోలింగ్ కంపార్ట్మెంట్లు నిర్మాణం చేయా లని, లోకసభకు బూతుకు తెలుపు రంగు స్టిక్కర్ను, శాసనసభ బూతుకు పింక్ కలర్ స్టిక్కర్ను ఆ తికించాలన్నారు. ఈవీఎం , వివి ప్యాట్ లలో మాదిరిగా పోలింగ్ మాకు పోలింగ్ సిద్ధం చేసుకోవా లని, ఈవీఎంసీ, వివి ప్యాడ్స్ బ్యాలెట్ యూనిట్ పనిచేసే విధానం తెలుసుకోవాలన్నారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా మీ విధులు నిర్వర్తించాలి అని,పోలింగ్కు టీం లీడర్ గా ఆర్ ఓ వ్యవహరిస్తార ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు బత్తలపల్లి శివ శంకర్ నాయక్, ధర్మవరం రమేష్, ముదిగుబ్బ సరస్వతి దేవి, తాడిమర్రి నజ్మా భాను, డిప్యూటీ తాసిల్దారులు, పీ వోలు, ఏపీవోలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img