Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉపాధి పనులపై విస్తృత అవగాహనతోపాటు కూలీల సంఖ్య పెంచాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

విశాలాంధ్ర-రాప్తాడు : ఉపాధి హామీ పనులపై విస్తృత అవగాహనతోపాటు కూలీల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం రాప్తాడు, ప్రసన్నాయనపల్లి గ్రామపంచాయతీల పరిధిలోని పండమేరు వంకలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలందరికీ ఓటు హక్కు ఉందా అంటూ కలెక్టర్ ఆరా తీశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ముఖ్యమైనదని, ఈనెల 14వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఇందులో చిరునామా మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంది, నీడ ఏర్పాటు చేశారా, మంచినీరు సౌకర్యం కల్పించారా, ఏ సమయంలో పనులకు వచ్చారు, ఎంత సమయం వరకు పనులు చేస్తారు, ఎక్కడి నుంచి పనులకు వచ్చారు, పనుల ప్రదేశం నుంచి మీ గ్రామానికి ఎంత దూరం ఉంది, తదితర వివరాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ రెండు నెలలుగా కూలీ డబ్బులు రాలేదని, కూలీ డబ్బులు ఇప్పించాలని కోరారు. రాప్తాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో, ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో తాగునీరు, పంచాయతీ నీరు రావడం లేదని తెలిపారు. ఉపాధి కూలీలకు కూలీ అందించే విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడుతామని కలెక్టర్ తెలిపారు. బీసీ కాలనీలో, ప్రసన్నాయనపల్లి గ్రామపంచాయతీలో తాగునీరు అందించడంపై మానిటర్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపీడి అనూరాధ, ఏఓ రత్నాబాయి, ఈఓఆర్డీ నరసింహారెడ్డి, ఏపీఓలు సావిత్రి, ఓబన్న, ఈసీ మురళీ, పంచాయతీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు, పరందామ, ఫీల్డ్ అసిస్టెంట్లు సాకే మునీంద్ర, విద్యాసాగర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img