Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వడదెబ్బపై ప్రభుత్వ హోమియో వైద్యశాఖ అవగాహన

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : వేసవి కాలం ఎండలు ఎక్కువ అవడంతో ప్రజలు సరియైన అవగాహన లేక వడదెబ్బకు గురి అయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆయుష్ శాఖ లో ఒక విభాగమైన హోమియో మందులను ఉచితంగా ప్రజలకు అందజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా బుధవారం స్థానిక విద్యుత్ పవర్ ఆఫీసులో పాతూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల సీనియర్ వైద్యాధికారి డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వడదెబ్బ లక్షణాలు గురించి తెలియజేస్తూ అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం, విపరీతమైన దాహం, నీరసం, గుండె వేగంగా కొట్టుకోవడం,వాంతులు అవడం, కండరాలు బిగుసుపోవడం, చర్మం పొడిగా, ఎర్రగా కంది పోవడం, శ్వాస వేగంగా పీల్చుకోవడం, ఫిట్స్ రావడం మొదలగునవి వడదెబ్బ రావడానికి గుర్తించవచ్చు అన్నారు. ఎవరికైతే వడదెబ్బ కు గురి అయిన వ్యక్తిని వ్యక్తిని గాలి తగిలే విధంగా చూసుకుని దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, ఉదయం 10 గంటల తర్వాత బయటికి పోకుండా వారిని చూసుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా చేనేత వస్త్రాలను ధరిస్తూ, చెవులకు వేడిగాలి తగలకుండా చూసుకోవాలన్నారు. ఎండలో ప్రయాణం చేసేటప్పుడు కొబ్బరినీళ్లు, గ్లూకోస్, మంచి పండ్ల రసాలని తీసుకోవాలని సూచించారు. అనంతరం వారికి ఉచితంగా హోమియో మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పవర్ ఆఫీస్ సూపర్డెంట్ లక్ష్మీబాయి, కృష్ణప్రియ, ప్రభుత్వ హోమియో వైద్యశాల ఫార్మసిస్ట్ కే. సుదర్శన్ రెడ్డి,సిబ్బంది శాంతమ్మ, బ్రహ్మకుమారి నిర్వాహకురాలు శారదా, మానవ హక్కుల సంఘం దక్షిణ భారత దేశ కార్యదర్శి ఆవుల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img