Monday, May 20, 2024
Monday, May 20, 2024

పాలకొండ శాసనసభ రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ శోభిక

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ శాసనసభకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసరయిన ఐఏఎస్ అధికారి కల్పనాకుమారిను అకస్మాత్తుగా బదిలీ చేస్తూ తక్షణమే జీఏడికి రిపోర్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉత్తర్వులు అందిన మరుక్షణమే కల్పన కుమారి రిలీవ్ అవ్వగా,జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆకస్మిక బదిలీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో దీనిపై ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం.
మంచిఅధికారికి బదిలీ జరగడం దురదృష్టకరమని, ఎన్నికల సమయంలో ఎన్నికల విధుల్లో ఉంటున్న అధికారిని ఆకస్మాత్తుగా బదిలీచేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఆమె బదిలీపై ఎవరు స్పందించకపోవడం గమనార్హం.పాలకొండ శాసనసభ నియోజకవర్గం నామినేషన్లను పాలకొండలోని ఆర్డీవో కార్యాలయం ఉండగా అక్కడ ఏర్పాటుచేయకుండా సీతంపేట ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటుచేయడంవలన బదిలీ జరిగి ఉంటుందని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img