Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నగదు, మద్యం పట్టివేత..

పోలింగ్‎కి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా విలువగల డబ్బు, మద్యం, వస్తువులను సీజ్ చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిఘా, భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు, 175 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలతో నిఘా పెట్టింది కమిషన్. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈనెల 13న తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఎండలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని సూచించింది ఎన్నికల సంఘం. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం, అలాంటి ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టేలా ప్లాన్ చేసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం.. అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగాలని నిర్ణయించింది. రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుండి 175 కంపెనీలు విధుల్లో ఉండనున్నాయి. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా 14 మందిని నియమించారు. జనరల్ పరిశీలకులుగా 17 మందిని నియమించారు. ఇక హోమ్ ఓటింగ్ కోసం 23,247 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకోగా. ఇందులో 21,651 మంది ఓటు వేశారు. ఇక ఇవాల్టి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లక్ష 80 వేలకు పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో టెక్నాలజీని కూడా ఈసారి బాగానే వినియోగిస్తున్నారు. సువిధ, సి విజిల్ యాప్‎లతో పాటు 1950 కాల్ సెంటర్ అందుబాటులో ఉంచారు. నేటితో ప్రచారాకిని గడువు ముగుస్తుంది. మిగిలే ఒక్క రోజు చాలా కీలకం కావడంతో అధికారులను మరింత అప్రమత్తం చేసింది ఎన్నికల సంఘం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img