Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల ఏర్పాట్లు సర్వం సిద్ధం

రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డిఓ.. వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం:: నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి ,ముదిగుబ్బ మండలాలలో ఈనెల 13వ తేదీన నిర్వహించబడే ఎన్నికల పనులు సర్వం సిద్ధం చేయడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన పోలింగ్ బూతులలో కూర్చోను పోలింగ్ ఏజెంట్లు తమ నియామకములో గల ఫారం 10 లో అన్ని విషయాలు భర్తీ చేసి, అభ్యర్థి గాని, ఎన్నికల ఏజెంట్ గాని తగిన వివరాలు సంతకాలతో నేరుగా ఆయా పోలింగ్ బూత్ పిఓలకు వెంటనే చేర్చాలని తెలిపారు. నాలుగు నియోజకవర్గాలలో 290 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా పోలింగ్ బూతులకు పిఓలు ఏపీవోలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం, తదితర పరికరాలను శనివారం నాడు మార్కెట్ యార్డులో పోలీస్ బందోబస్తు నడుమ అన్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన నిర్వహించబడే ఎన్నికలు ఆయా పోలింగ్ బూతుల వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుందని, ఆయా సమయాలలో ఓటర్లు అందరూ కూడా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలో ధర్మవరం టౌన్ లో 105 పోలింగ్ బూతులు, రూరల్ పరిధిలో 49, బత్తలపల్లి లో 42, తాడిమర్రిలో 32, ముదిగుబ్బలో 62 వెరసి 290 పోలింగ్ బూతులు సర్వం సిద్ధం కావడం జరిగిందని తెలిపారు. ఈనెల 12వ తేదీన నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులకు ధర్మవరంలోని మార్కెట్ యార్డ్ ద్వారా పిఓ అండ్ ఏపీవో అధికారులకు ఎన్నికల సామాగ్రిని, పోలీస్ పహారా నడుమ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు కార్డుతో మీకు కేటాయించిన పోలింగ్ బూతులందు తమ ఓటును వేయాలని వారు తెలిపారు. కావున నియోజకవర్గ ప్రజలు ముందుగానే మీ పోలింగ్ బూత్ కేంద్రాలను తెలుసుకొని ఉంటే మంచిదని తెలిపారు. ఎన్నికలను సజావుగా అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img