మదర్ తెరిసా సేవా సంఘం అధ్యక్షులు ప్రసాద్ పట్నాయక్. విశాలాంధ్ర విజయనగరం రూరల్ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి, యాంటీ టెర్రరిజం డే సందర్భంగా పట్టణంలో ఉన్న రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్, అయ్యన్నపేటలో ఉన్న మదర్ తెరిసా కిడ్స్ పాఠశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఫౌండర్,అధ్యక్షులు ప్రసాద్ పట్నాయక్ తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ రక్తం యొక్క విలువలు తెలుసుకొని మనుషుల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహాయంగా ఇటువంటి రక్తదాన శిబిరాలలో పాల్గొనాలన్నారు