Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్…

విశాలాంధ్ర- ఏలూరు: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి, అనతికాలంలోనే అధికారాన్ని చేపట్టిన ఖ్యాతిని గడించి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నతవ్యక్తి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు కూటమి ఉమ్మడి అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్‌,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి లు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గన్నీ వీరాంజనేయులు, బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్‌లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గన్ని మాట్లాడుతూ పార్టీ స్థాపించిన అనతికాలంలోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి, ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చారని, పేదవారికి అండగా ఉండడమే పార్టీ సిద్ధాంతంగా పనిచేశారన్నారు. బడేటి చంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలతో ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారని, 1983 ఫలితాలు 2024 లో పునరావృత్తం అవబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పవర్ పేట బడేటి క్యాంపు కార్యాలయం నందు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి, తన సోదరులు స్వర్గీయ బడేటి కోటరామారావు (బుజ్జి) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మరడాని రంగారావు, ఉప్పాల జగదీష్ బాబు, ఎంఆర్డీ బలరాం, కొట్టు మనోజ్, ఎంబిఎస్ శర్మ, లంకపల్లి మాణిక్యాలరావు, నెరుసు గంగరాజు, చోడే వెంకటరత్నం, సిరిబత్తిన కొండబాబు, వందనాల శ్రీనివాసరావు, పిల్లారిశెట్టి సంధ్య సురేష్ కుమార్, కడియాల విజయలక్ష్మీ , వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img