Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

బాలకార్మిక రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్ధిదాం

కేసలి అప్పారావు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలో కోట జంక్షన్ నుండి మూడు లాంతర్లు వరకు బాలలతో ,బాలలు కోసం పనిచేస్తున్న జిల్లా స్థాయి విభాగాల అధికారులు ,సిబ్బంది తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు జెండా ఊపి భారీ స్థాయిలో ర్యాలీ నీ ప్రారంభించారు.ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బాలలు తప్పకుండా బడిలో ఉండాలి తప్ప ,పనిలో ఉండకూడదని అలగే పనిలో ఎవ్వరైనా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బాలలను పనిలో పెట్టుకుంటే వారిపై. భారీ గా జరిమానాలు విధించి, శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు.డిసెంబర్ – 25 నాటికి పూర్తి స్థాయిలో బాలకార్మికులు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి అందరి భాగస్వామ్యంతో ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటామని,గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గల 26 జిల్లాల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలన చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రములోని అందరి సహకారం,సమన్వయంతో బాలల భద్రతకు, రక్షణకు, సంరక్షణకు శక్తివంచన లేకుండా కృషిచేసి వారి బంగారు భవిష్యత్తు కి పునాదులు వేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్ పర్సన్ జీ హిమబిందు, పోలీసు శాఖ నుండి
ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బెండు వెంకటరావు, దిశా పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరిసింగరావు మాట్లాడుతూ
అంతర్జాతీయంగా కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2002 లో బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని ప్రారంభించింది, ప్రతి సంవత్సరం జూన్ 12 న ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల నిర్మూలన కోసం దృష్టి సారించింది మరియు దీనిని తొలగించడానికి అవసరమైన చర్యలు మరియు ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు ప్రభుత్వాలు, యజమానులు మరియు కార్మికుల సంస్థలు, పౌర సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పిల్లలను బాలకార్మికుల దుస్థితిని గుర్తించడానికి మరియు వారికి సహాయపడటానికి పునరావాసం కల్పించడానికి తరచుగా పోరాడుతోందనీ తెలిపారు
జిల్లా కార్మిక శాఖ అధికారులు ఎన్ .సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు , చంద్ర శేఖర్, శ్రీనివాసరావు, కిరణ్ ,మహిళా శిశు సంక్షేమ శాఖ పట్టణ ప్రాజెక్టు అధికారి జీ.ప్రసన్న, మిషన్ వాత్సల్య సిబ్బంది యాళ్ల నాగరాజు, రామకోటి,వెంకటరావు , అప్పారావు ,చైల్డ్ లైన్ సిబ్బంది అరుణ్ కుమార్ ,మీనా, గౌరీ,
వైసిబి స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఝాన్సి రాణి,ఫాల్గుణ , అడ్వకేట్ బ్యోల రాణి మరియు అంగన్వాడీ పర్యవేక్షకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img