Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సీనియర్లకుదక్కనిచోటు

మంత్రి పదవుల్లో కొత్తవారికే అందలం
గంటా, గద్దె, కన్నా, బోండా అసంతృప్తి
కైకలూరు ఎమ్మెల్యే కామినేనికి అనారోగ్యం
ఏడు జిల్లాలకు దక్కని ప్రాధాన్యత

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) నుంచి గెలుపొందిన సీనియర్లకు మంత్రి పదవుల్లో చుక్కెదురయింది. కూటమి సభాపక్ష నేత, సీఎం చంద్రబాబు రaలక్‌ ఇచ్చారు. ఆశించిన వారికి మంత్రి పదవుల జాబితాలో చోటు దక్కలేదు. చంద్రబాబుతో పాటు 24 మందికి మంత్రి పదవులు వరించగా… అందులో కొత్తగా 17 మందికి చోటు దక్కింది. దీంతో సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారు. ఈ మంత్రి పదవుల్లో అత్యధికంగా 20 టీడీపీ ఎమ్మెల్యేలకే దక్కగా, జనసేనకు 3, బీజేపీకి ఒక్కరితోనే సరిపెట్టారు. దీనిని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సీనియర్లకు మంత్రి పదవులు దక్కకపోవడంతో వారు నిరుత్సాహం చెందారు. టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావ్‌, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళి నరేంద్ర, చింతమనేని ప్రభాకర్‌, గద్దె రామ్మోహన్‌, బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్‌ తాతయ్య తదితరులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కన్నా లక్ష్మీనారాయణ, రఘురామకృష్ణరాజు, కూన రవికుమార్‌, నక్కా ఆనందరావు, అఖిల ప్రియ, పరిటాల సునీత తదితరులకు అవకాశం రాలేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి గెలిచిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, ఏలూరు జిల్లాకు నూజివీడుకు చెందిన కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు వరించాయి. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి, గుమ్మనూరు జయరామ్‌కు అవకాశం దక్కలేదు. ఏలూరు జిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌కు మొదటి నుంచి బీజేపీ కోటాలో మంత్రి పదవి వస్తుందని భావించారు. అనూహ్యంగా బీజేపీ నుంచి ఒక్కరికే ధర్మవరం నియోజకవర్గానికి చెందిన సత్యకుమార్‌కు చోటు దక్కింది. కామినేని, సత్యకుమార్‌ ఇద్దరూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సన్నిహితులుగా ఉన్నారు. అదే సమయంలో సత్యకుమార్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో మంచి పరిచయాలున్నాయి. ఈ లాబీయింగ్‌ ఆధారంగా సత్యకుమార్‌కు మంత్రి పదవి వరించినట్లు సమాచారం. దీనిపై కామినేని శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తితో ఉండి ఆస్పత్రిలో చేరినట్లుగా ప్రచారం ఉంది. కామినేని శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు అనారోగ్యం ఉన్నందువల్లే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. సీఎం చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే బీజేపీ కోటా నుంచి విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంత్రి పదవి ఆశించినా లభించలేదు. విశాఖ జిల్లా నుంచి మరో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకూ పదవి వరించలేదు. జనసేన నుంచి మంత్రి పదవులు ఆశించిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్‌కు చోటు దక్కలేదు. మంత్రి పదవుల్లో అవకాశం లేని కూటమి ఎమ్మెల్యేలలో సీనియర్లకు అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌, విప్‌లు తదితర పదవుల పంపకాలు చేపట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
మంత్రివర్గంలో ఏడు కొత్త జిల్లాలకు దక్కని ప్రాధాన్యత
మంత్రివర్గ కూర్పులో ఏడు కొత్త జిల్లాలకు చెందిన కూటమి నేతలకు ప్రాధాన్యత దక్కలేదు. ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్‌, విశాఖ, పల్నాడు, వైఎస్‌ఆర్‌ కడప, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో కూటమి నేతలు గెలిచినప్పటికీ అక్కడ సముచిత స్థానం దక్కలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ నగరం నుంచి విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్‌ మూడు సార్లు గెలుపొంది, హ్యాట్రిక్‌ సాధించారు. ఆయనకు ఈ విడత కచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా రాలేదు. విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకూ బెర్తు దక్కలేదు. పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి, జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యేగా శ్రీరామ్‌ తాతయ్య విజయం సాధించినప్పటికీ… మంత్రి పదవి వరించలేదు. ఇక విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో భీమిలి నుంచి అఖండ విజయం సాధించినా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదే జిల్లా నుంచి విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తరం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు గెలిచినా ఈ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. పల్నాడు జిల్లాలోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్‌, జూలకంటి భాస్కర్‌రెడ్డి తదితరులు విజయం సాధించినప్పటికీ, ఆ జిల్లాకు మంత్రి పదవి లభించలేదు. వైఎస్సార్‌ కడప జిల్లాలో మైదుకూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, బీజేపీ తరపున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి విజయం సాధించినా… ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. తిరుపతి జిల్లాలోనూ టీడీపీ ఎమ్మెల్యేలుగా చంద్రగిరి నుంచి పులివర్తి నాని, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్‌రెడ్డి తదితరులు విజయం సాధించినప్పటికీ. మంత్రి పదవులు దక్కలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img