Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

ప్రజాస్వామ్య భారత్‌లో ఐదేళ్లకొకసారి పార్లమెంట్‌కు, ఆయా రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం పరిపాటి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి మే 13వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగగా, జూన్‌ 4న వెలువడిన ఫలితాలలో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం విదితమే. కొత్త ప్రభుత్వం బుధవారం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మరో 22 మంది మంత్రుల చేత రాష్ట్ర గవర్నరు అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. వీరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ కూడా ఉన్నారు. కృష్ణాజిల్లా కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు లోతుగా కసరత్తు చేసి అత్యధిక సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ, సమతుల్యతతో నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు కేబినెట్‌ పాత, కొత్తల సమ్మిళితంగా ఉన్నది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రులలో 17 మంది కొత్త వారున్నారు. ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైనదశ నుంచి అరాచక, విధ్వంసకర పాలన సాగించిన జగన్‌కు ఎదురొడ్డి నిలబడి, చంద్రబాబు అద్భుత విజయం సాధించారు. మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకున్నారు. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు శాసనసభలో ప్రవేశించారు. 1995లో టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు దఫాలు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రాసంఘాల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్‌ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక, ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి మేఘాలు ముసురుకున్న పరిస్థితుల్లో ఆయన అపార పరిపాలనా అనుభవం, దార్శనికత రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాయని ప్రజలు గట్టిగా నమ్మారు, అందుకే ఊహించని విజయం చేకూర్చారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. జగన్‌ పాలనలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాక, ఆర్థికవ్యవస్థ కుదేలయ్యాక వచ్చే ఐదేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరుమీద బండి నడక కానేకాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడినపెట్టడం, తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి, ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమల్ని తేవడం అనుకున్నంత సుళువుకాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం పాటిస్తూ పాలన సాగించాలి. 2014లో అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు అనుసరించిన దుష్టవిధానాలు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్షాలను అసలు లెక్కచేయలేదు, సమస్యలపై చర్చించేందుకు ఏనాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు, ఉద్యమాలు, పోరాటాలను ఏ విధంగా అణచివేయాలో అన్ని విధాల అణచివేశారు. ఎన్నో కేసులు, నోరు తెరిస్తే నోటీసులు, కాలు కదిపితే అరెస్టులు, ఇదేంటని ప్రశ్నిస్తే వేధింపులు… గృహనిర్బంధాలు…మాట్లాడే స్వేచ్ఛలేక, ప్రశ్నించే హక్కును కోల్పోవడంతో విసిగివేసారి పోయిన ప్రజలు 2019 ఎన్నికలలో వైసీపీకి పట్టంకట్టారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విధానాలను మరింత విశృంఖలం చేసి ప్రజలను మరింత విసిగించి దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చేలా చేసుకున్నారు. ఇకపై విధ్వంసాలు, కక్షసాధింపులు, అరాచక రాజకీయాలు ఉండవని మంగళవారం నాటి ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో చేసిన ప్రసంగానికి చంద్రబాబు నాయుడు కట్టుబడివుండాలి. విశాఖ, కర్నూలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో, సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్న వ్యాఖ్యలను చంద్రబాబు సదా గుర్తుంచుకుని పాలనసాగించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి, అవసరమైతే పోరాడైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజనహామీల సాధనకు కృషి చేయాలి. శాసనసభలో ప్రాతినిధ్యంతో నిమిత్తంలేకుండా అన్ని ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. సమస్యలపై తరుచూ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. విభజన హామీల అమలుకు అవసరమైతే దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రజాసమస్యల పరిష్కారానికి అహ్నరిశలు కృషి చేయాలి. అహంకారంతో విర్రవీగితే పర్యవసానం ఏమిటో 2024 ఎన్నికలు కళ్లకుకట్టినట్టు చూపించాయి. అధికారంలో ఉన్నవారు రేపన్నదే లేనట్టు వ్యవహరిస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకుని పాలన సాగించాలి. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలని చంద్రబాబు తరుచూ చెపుతుంటారు, చెప్పడమే కాదు… దాన్ని ఆయన ఆచరణలో పెట్టాలి. దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలి. రాజకీయ శాడిజంపై అలుపెరగని పోరాటం చేసి తెలుగు ప్రజలకు ఉపశమనం కలిగించిన చంద్రబాబు ప్రజల అకాంక్షలకు, ఆశలకు అనుగుణంగా పాలన సాగించాలి. సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img