Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

లాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు పట్ల హర్షం వ్యక్తం చేసిన చోడవరం బార్ అసోసియేషన్

విశాలాంధ్ర – చోడవరం : తే14.06.2024ది. అన్ని వర్గాల ప్రజలకు అత్యంత ప్రమాదకారి అయిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన ఏ.పి. సి.ఎం.నారా చంద్రబాబుకు అనకాపల్లి జిల్లా, చోడవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు ధన్యవాదాలు తెలియజేసారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి జి.కృష్ణవేణి ఆధ్వర్యంలో న్యాయస్థానముల సముదాయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా చట్టం చేసిన లాండ్ టైట్లింగ్ రద్దు కోరుతూ చోడవరం బార్ అసోసియేషన్ అనేక పోరాటాలు చేసిందన్నారు. లాండ్ టైటిలింగ్ యాక్టు పై న్యాయవాదులు, ప్రజల పోరాటాన్ని, ఆరాటాన్ని లెక్క చేయకుండా చట్టం చేసిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు. లాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు పై నాడు టి.డి.పి. పెద్దలు ఇచ్చిన హామీతో దీక్షలు విరమించామని తెలియజేసారు. టైటి లింగ్ యాక్టు రద్దు పై ఇచ్చిన మాట ను నిలబెట్టుకున్న ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.పి. అల్లు గిరిధర్, గూనూరు లక్ష్మి నారాయణ, కొల్లి శ్రీను, లక్ష్మి నారాయణ, ఆర్.ఎస్.పి.నాయుడు, చీపురుపల్లి సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img