పార్టీ నేతలకు, శ్రేణులకు చంద్ర బాబు హిత బోద
- కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం చంద్రబాబు తెలిపారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నేడు చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ చేశారు.
- ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడతా. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నాు అని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.