Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తారా..ఎవర్నీ వదిలేది లేదు : విజ‌య సాయిరెడ్డి

  • దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్‌ పై రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి స్పందించారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లేడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని ఆరోపించారు. నేడు విశాఖపట్నంలో ఆయ‌న నేడు మీడియాలో మాట్లాడుతూ, త‌న పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది త‌మ‌ వైసీపీ పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. కాగా, నిన్న త‌మ‌ ఇంటికి ఒక పార్టీ వాళ్లు వచ్చి విజయసాయిరెడ్డి ఎక్కడ అని అడిగాంటూ చెబుతూ, తాను నేను సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాన‌ని వెల్ల‌డించారు..త‌న ఇంటికి వచ్చి భయపెట్టే తాటాకు చప్పుళ్లకు లొంగేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కై మా వైసీపీ పార్టీ వాళ్ళే నా మీద ఆరోపణలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ సాయిరెడ్డి. తాను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేయన‌ని అంటూ తాను వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడనని తేల్చి చెప్పారు . మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలు ఒక ఆదివాసీ మహిళ ను అవమానించారని మండిపడ్డారు. నిరాధారమైన వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని ఆగ్రహించారు. ఇది ఘోరమైన తప్పిదమని నిప్పులు చెరిగారు. త‌మ మీద దారుణంగా రాతలు రాసిన వాళ్ళ తో ఎలా క్షమాపణలు చెప్పించాలో నాకు తెలుసన్నారు. తన‌ మీద జ‌రుగుతున్న కుట్రలు బయటపెడతాన‌ని, .విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా వుంటుందో చేసి చూపిస్తానని హెచ్చరించారు మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ళ తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img