సి ఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేమయ్యారు. సచివాలయంలో ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ గే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వనమహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై చర్చ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు