ఆంధ్రప్రభ స్మార్ట్ ఉ నేటి నుంచి శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ జెన్‌కో.. ఇక, దిగువన ఉన్న నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరారు సాగర్ అధికారులు. దీంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగర్ కి 3 టీఎంసీల నీటిని విడుదల చేసే క్రమంలో విద్యుత్ ఉత్పత్తని ప్రారంభించారు. మొత్తంగా శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే .. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో నిల్‌గా ఉంది.. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో ఔట్ ఫ్లో 15,919 క్యూసెక్కులుగా ఉంది.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 812.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 35.9850 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరింతస్థాయిలో నీటిమట్టం చేరితో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ అధికారులు..