విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని గుట్టి కింద పల్లి లో గల కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అభివృద్ధి బాటలో, అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపడతామని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కె. ప్రభాకర్ రెడ్డి, అధ్యాపక, బోధ నేతల సిబ్బంది మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి పుష్పగుచ్చము ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎన్ ఏ ఏ సి కౌన్సిల్కు వెళ్తున్న పరిస్థితులను మంత్రికి తెలియజేశారు. కళాశాల అభివృద్ధిలో భాగంగా కళాశాల ప్రాంగణం లోపల సీసీ రోడ్డు, కంప్యూటర్స్ ను కోరుతూ మంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. సీసీ రోడ్డు కళాశాల లోపల వేయించడానికి మంత్రి అంగీకరించడంతో, కళాశాల ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చిట్టెమ్మ, షమీవుల్లా, భువనేశ్వరి, పుష్పావతి, తాహీర్, సరస్వతి, ఆనంద్, మీనా, గంగ తదితరులు పాల్గొన్నారు.