Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు

ఎన్నికలలో లబ్ది కోసం మతాన్ని, కులాన్ని వినియోగించు కోవడం అమృతోత్సవ కాలంలో కూడా కొనసాగుతూనే ఉంది. కొన్ని సందర్భాలలో ఈ రెండూ ఉన్మాద స్థాయికి చేరుతున్నాయి. లోకసభలో బీజేపీ సభ్యుడు అనురాగ్‌ ఠాకూర్‌ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ‘‘తన కులం ఏమిటో తెలియనివ్యక్తి కుల గణన గురించి మాట్లాడుతున్నారు’’ అన్నారు. ఇది కేవలం విమర్శ కాదు. రాహుల్‌ గాంధీ కులాన్ని వివాదాస్పదం చేయడం మాత్రమే కాదు. ఆయన కులాన్ని ఎత్తి చూపి ఎద్దేవా చేయడం. మతోన్మాదం తలకెక్కిన అనురాగ్‌ ఠాకూర్‌ లాంటి వారి నుంచి సభా మర్యాదల లాంటివాటిని ఆశించడం దురాశే. అన్నింటికీ ‘‘నో నో’’ అనే లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం అనురాగ్‌ ఠాకూర్‌ రెచ్చిపోయి రాహుల్‌ గాంధీ కులం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనను నివారించే ప్రయత్నం చేయలేదు. ఇది అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన పొరపాటు కన్నా చాలా పెద్దది. తీరిగ్గా ఠాకూర్‌ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తే తొలగించి ఉండొచ్చు. తనను స్పీకర్‌ను చేసిన పార్టీకి విధేయంగా ఉండడంలో ఓం బిర్లా సకల ఆనవాయితీలనూ మంటగలుపుతున్నారు. కులగణన జరిపించాలని బీజేపీ మినహా దాదాపు మిగతా రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయి. కేవలం కోరడానికి పరిమితం కాకుండా ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనతో ఉన్నప్పుడు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మొదట కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడితో ఆగలేదు బీహార్‌లో కులగణన చేయించారు. ఇప్పుడు రిజర్వేషన్ల సదుపాయం పొందుతున్నవారు కాకుండా ఇంకా ఈ ప్రయోజనం పొందవలసినవారు ఎంతమంది ఉన్నారో ఈ కులగణనలో నిగ్గు తేలింది. మండల్‌ కమిషన్‌ లాంటివి వెనుకబడిన కులాల లెక్కలు తీశాయే తప్ప శాస్త్రీయంగా ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో లెక్క కట్టలేదు. రిజర్వేషన్ల అవసరం ఎంత ఉందో అర్హులైన వారికి ఆ సదుపాయం కల్పించడం అంతకన్నా అవసరం. కులగణనను సమర్థించినందుకే కాక కులగణన చేయించి తీరుతాం అని రాహుల్‌ గాంధీ అనడం అనురాగ్‌ ఠాకూర్‌ కే కాదు బీజేపీకి ఏ మాత్రం మింగుడు పడడంలేదు. అనురాగ్‌ పార్లమెంటరీ సంప్రాదాయాలనే కాక ఒక మనిషిగా తనకు ఉండవలసిన సంస్కారాన్ని కూడా త్యజించారు. అనురాగ్‌ ఠాకూర్‌ ప్రవర్తనలో కొంచెపుతనం ఉండొచ్చునేమో కానీ ఆయన బీజేపీలో గణనీయమైన నాయకుడే. ఇదివరకు ఆయన మోదీ మంత్రి వర్గ సభ్యులుగా ఉన్నారు. ఈ సారి తనకు మంత్రిపదవి దక్కలేదన్న వ్యథ ఆయనకు ఉంటే ఆ విషయం మోదీతో తేల్చుకోవాలి. అనురాగ్‌ ఠాకూర్‌ ఈశాన్య దిల్లీలో మత కలహాలు జరగక ముందూ ఇలాంటి ప్రేలాపనలే చేశారు. ఆ తరవాత అక్కడ మత కలహాలు జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి కులం గురించి ప్రస్తావించి తాను ఎంతగా దిగజారగలనో నిరూపించుకున్నారు. బీహార్‌ లో కులగణన చేయించిన నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు మోదీ పంచన చేరారు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని బీజేపీ కులగణనను ఎలా వ్యతిరేకించగలుగుతోందో అంతుబట్టదు.
కులం మన దేశంలో వాస్తవం అయి ఉండొచ్చు. ఒక్క సారిగా కులాన్ని వదులుకోవడం, అది ప్రభుత్వ ఆదేశాలవల్ల మాయమై పోతుందనుకోవడం కల్ల. అందుకే భారత రాజ్యాంగంలోని 15 వ అధికరణం కులం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధించింది. దేవాలయాలు, వస్తు ప్రదర్శన శాలలు, స్నాన ఘట్టాలు, ప్రజలకందరికీ చెందిన బావులు మొదలైన విషయాల్లో కుల వివక్షను రాజ్యాంగం నిషేధించింది. మన రాజ్యాంగ పరమోద్దేశం సామాజిక సమానత్వం, అందరికీ సమానావకాశాలు ఉండడం, వివిధ రూపాల్లో వెనకబడి ఉన్న వారికి చేయూత అందించడం. అంటరానితనం శిక్షార్హమైన నేరం. దీనికి ప్రత్యేక చట్టాలే ఉన్నాయి. ఈ విషయాలన్నీ అనురాగ్‌ ఠాకూర్‌ లాంటి వారి మదికెక్కుతాయని అనుకోలేం. ఎందుకంటే అలాంటి వారు ఎంతటి పై స్థాయికి వెళ్లినా రాజ్యాంగాన్ని చదవరు. చదివినా జీర్ణం కాదేమో. రాజ్యాంగాన్ని కళ్లకద్దుకునే పొత్తంగా ఇటీవల మోదీ మార్చారు. మొదటిసారి పార్లమెంటులో ప్రవేశించే ముందు ఆ మెట్లకు మొక్కారు. ఇవన్నీ హృదయం నుంచి వచ్చినవి కావు. నిండు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి కులం ఏమిటి అన్న అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తిని ప్రధానమంత్రి మోదీ వెనకేసుకు రావడం దిగజారుడు రాజకీయాలు ఎంత పతన స్థాయికి చేరగలవో నిరూపించాయి. అనురాగ్‌ ఠాకూర్‌ ప్రసంగం వాస్తవాధారితమైందట. ఈ ప్రసంగం అందరూ చదివి, విని తరించాలట. ఇంత అమార్యదకరంగా అన్న మాటలు మోదీ చెవికి హృద్యమైన సంగీతంగా వినిపించడం ఆయన అభిప్రాయాలూ అనురాగ్‌ ఠాకూర్‌ అభిప్రాయాలకు ఏ మాత్రం భిన్నమైనవి కాదని తేలిపోయింది. ఇది సామాజిక, రాజకీయ, పార్లమెంటరీ సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైందని మోదీకి తట్ట లేదంటే ఇలాంటి విషయాల్లో అనురాగ్‌ ఠాకూర్‌ అభిప్రాయాలకు, మోదీ నాయకత్వం వహిస్తున్న పార్టీ, ప్రభుత్వ భావనలకు ఎంత మాత్రం తేడా లేదని రుజువు అవుతోంది. రాహుల్‌ గాంధీ ప్రమాదవశాత్తు హిందువు అయినారని అని అనురాగ్‌ ఠాకూర్‌ దుస్సాహసానికి మాత్రమే కాదు ఎంత నీచస్థాయికి దిగజారగలరో రుజువు చేసుకున్నారు. తన యువ, శక్తిమంతుడైన సహచరుడి మాటలు ‘‘ఇండియా’’ కూటమి ‘‘నీచ రాజకీయాల’’ను బహిర్గతం చేశాయని మోదీ మురిసిపోతున్నారు. ఇలాంటి చేష్టలు పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైనవని మోదీ కూడా భావించడం లేదు. అలాంటప్పుడు అవి రాజ్యాంగ విరుద్ధమైనవని ఆయన గ్రహించగలరనుకోవడం భ్రమ. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తప్పని సరై మోదీ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ మద్దతు స్వీకరించి ఉండవచ్చు. కానీ కులగణన జరిపించిన నితీశ్‌ ఈ వివాదంపై పెదవి విప్పకపోవడం విచిత్రాలలోకెల్లా విచిత్రం. మొత్తంమీద మోదీ బృందం యువతకు ఇవ్వదలచుకున్న సందేశం ఇదేనేమో. ఇది బీజేపీ అహంకారానికి చరమాంకం. ప్రతిపక్షాలు మోదీ మీద విశేషాధికారాలకు భంగం కలిగించినందుకు తీర్మానం ప్రవేశ పెట్టి ఉండొచ్చు. అది స్పీకర్‌ అనుమతి పొందుతుందనుకోవడం కష్టమే. పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం లేని మోదీ ఇటీవల ఆ బాధ్యతను నిర్మలా సీతారామన్‌, కిరణ్‌ రిజిజు లాంటి వారికి అప్పగించారు. వారు ప్రతిపక్ష నాయకుడిపై దుమ్మెత్తి పోయడంలో ఏ లోటూ చేయడం లేదు. ఆ విమర్శలు చాలవని భావించి అనురాగ్‌ ఠాకూర్‌ లాంటి వ్యక్తిని రంగంలోకి దించినట్టున్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి, హిరేన్‌ ముఖర్జీ, ఇంద్రజిత్‌ గుప్తా, మధి లిమయే, మధు దండావతే లాంటి ఉత్తమ పార్లమెంటేరియన్లకు ఇప్పుడు కొరత ఉండొచ్చు. కాని వారు నెలకొల్పిన సంప్రదాయాలను ఇంత భయంకరంగా భ్రష్టు పట్టించడం మోదీ సర్కారు పుణ్యమే. మోదీయే ఈ దూషణలను వెనకేసుకొచ్చినప్పుడు అనురాగ్‌ ఠాకూర్‌ లాంటి వారికి కొదవేం ఉంటుంది? కానీ మేటి సంప్రదాయాలు ఏమైపోయాయన్నదే అసలు బాధ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img