Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

చోడవరాన్ని మరో విజయవాడ చెయ్యవద్ధు ….అఖిల పక్ష పార్టీలు డిమాండ్…..

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా, చోడవరం పట్టణాన్ని మరో విజయవాడ వలె వరద ప్రమాదాల్లో మునిగిపోయేట్లు చేయవద్దని సి.పి.ఐ. జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏ.పి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చోడవరం మేజర్ పంచాయతీలో సర్వే నెం. 83లో అతిపెద్ద పారిశుధ్య వనరు గా ఉపయోగపడే పాత చెరువును గ్రావేల్ మట్టి తో కప్పివేయడం వలన, చోడవరం లోతట్టు ప్రాంతాలైన ద్వారకా నగర్, రెల్లివీధి, కో- ఆపరేటివ్ కాలనీ, బాలాజీ నగర్, గునిశెట్టివారి వీధి, కోట వీధి, గండి కాలనీ, ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతున్నాయని అన్నారు. ఈ మధ్య కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు, పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయిం అయ్యాయని తెలిపారు. చెరువులు, కాలువలు, డ్రైనేజీలు ఆక్రమణకు గురి కావడంతో రహదారులే చెరువులయ్యాయని తెలిపారు. పాత చెరువు కబ్జా పై గతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, హై కోర్ట్ ను అశ్రాయించాగా, డబ్ల్యూ.పి. 9882/24, ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సంబదించిన రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురైన పాత చెరువు లో గ్రావెల్ మట్టిని తొలగించి, చెరువును కాపాడాలని ఆర్డర్ ఇవ్వగా, నేటికీ అధికారులు కనీసం గ్రావెల్ మట్టిని కూడా తొలగించకపోవడం వలన, చోడవరం లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి అని తెలిపారు. అధికారులు నెటికైనా స్పందించి, బడాబాబులు చేతుల్లో కబ్జాకు గురైన పాత చెరువును చెరువును కాపాడమని అఖిల పక్ష పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో బి.జె.పి. కార్యదర్సి , బుద్ధా అమర్నాథ్, కాంతికుమార్, సదరం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img