Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కక్షలు, కార్పన్యాలు మానండి… అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించండి

ఎన్డీఏ కూటమి శ్రేణులకు వైకాపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు వెంకటలక్ష్మి సూచన

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎన్డీఏ కూటమి నాయకులు కక్షలు కార్పన్యాలు మాని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని వైకాపా ఎస్టీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో వైకాపా శ్రేణులపై కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు దాడులకు తెగబడడం మంచి సంస్కృతి కాదన్నారు. గడచిన ఐదేళ్లుగా తమ ప్రభుత్వం (వైకాపా) ప్రజారంజకంగా సంక్షేమ పాలన అందించినప్పటికీ సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా పరాజయం పాలవడం బాధ కలిగిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కుల, మతాలు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నేరుగా లబ్ధిదారులకు అందేలా సంక్షేమ పథకాలు అందించినప్పటికీ కేంద్ర రాష్ట్రాలలో అధికారమే ప్రధాన అజెండాగా రాష్ట్రంలో తెదేపా, జనసేన పార్టీలు కేంద్రంలోని బిజెపితో కూటమి కట్టి అమలు సాధ్యం కానీ హామీలతో ఒంటరిగా పోటీ చేసిన వైకాపా పరిపాలనపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలలో గెలిచారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వైకాపా స్వీకరిస్తుందని, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా పరిపాలించవలసిన సమయంలో వైకాపా నాయకులపై, వారి ఇళ్లపై కూటమి పార్టీల శ్రేణులు దాడులకు తెగబడడం మంచి సంస్కృతి కాదన్నారు. ప్రజలకు ఎంత మేలు చేసినా, కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు ఇంకేదో మేలు చేస్తాయనే భ్రమలో ప్రతిపక్ష పార్టీలు చేసే మోసపూరిత ప్రకటనలు నమ్మి జెండాలు తప్ప అజెండా లేని ఎన్డీఏ కు ప్రజలు కేంద్ర, రాష్ట్రాలలో అధికారం కట్టబెట్టారన్నారు. ఏకపక్ష విజయం సాధించామని తెదేపా శ్రేణులు దాడులకు దిగుతున్నారని, ఇటువంటి దాడులను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా తమకు ప్రజాబలం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజా పక్షాన వైకాపా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img