Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వీనుల విందుగా హోలీ పర్వదిన వేడుక

తాజంగిలో రాధాకృష్ణల మందిరం వద్ద అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా)- :- మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రంలోని రాధాకృష్ణుల మందిరం వద్ద నిర్వహించిన హోలీ పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుక్లపక్షం రోజున నిర్వహించే ఈ హోళీ వేడుకలను తాజంగి ప్రాంతవాసులు ఘనంగా నిర్వహించారు.. ఈ ప్రాంత వాసుల పూర్వీకులు ఒడిస్సాలో జీవించినప్పటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పర్వదిన వేడుకలను ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చినా, వారి పూర్వీకులు నిర్వహించే సాంప్రదాయాన్ని వీరు కొనసాగిస్తున్నారు. మండలంలోని తాజంగి గ్రామంలో పౌర్ణమి రోజైన ఆదివారం ఉదయం నుంచి రాధాకృష్ణుల మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హెూమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ రాధాకృష్ణులు, శ్రీ పాకలపాడు గురుదేవుల విగ్రహ ప్రతిమలను తప్పేట, కోలాటాల నడుమ ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో గుడి వద్ద నుంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామంలో కట్టెలతో ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన హోలీ టవర్ ను సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గం.లకు అత్యంత భక్తిశ్రద్దలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్త ప్రహ్లాద హోమం నిర్వహించి కట్టెలతో నిర్మించిన హోలీ టవర్ ను వెలిగించారు. ఆ ఎత్తైన టవర్ పై ఏర్పాటు చసిన జెండా ఎటు వైపు పడుతుందో అటువైపు ప్రాంతంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం. పడుతున్న ఆ జెండాను ఎవరు పట్టుకుంటారో వారిని నగదు బహుమతితో సత్కరించి, గ్రామంలో ఊరేగించడం ఆనవాయితీ. ఆయన ఇంటి వరకు తీసుకు వెళతారు. వీనుల విందైన ఈ వేడుకను తిలకించెందుకు తాజంగి చుట్టు ప్రక్కల ప్రజలతో పాటు, తాజంగి ప్రజలకు చెందిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కుటుంబాల వారు, అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img