Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చేయూత వారియర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్, విశాఖపట్నం వారి సహకారంతో ఆదివారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నంకు చెందిన డాక్టర్ బి వి వి ప్రసాద్ సమక్షంలో మండల కేంద్రంలోని ప్రముఖులతో పాటు యువకులు, పెద్దలు ఉత్సాహంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో నేటి యువత ముందున్నారని, దానికి నిదర్శనంగా సమాజం పట్ల బాధ్యతతో చింతపల్లికి చెందిన చేయూత వారియర్స్ ట్రస్ట్ యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. విరివిగా ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, నేటి సమాజంలో అనేకమంది రక్తహీనతతో, అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల క్షతగాత్రులైన వారికి, రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడే వారికి సరైన సమయంలో రక్తం అందించక ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు విరివిగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని అన్నారు. రక్తదానంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని, తద్వారా శరీరంలో రక్తం ఉత్పత్తి మెరుగుపడుతుందని, వివిధ రుగ్మతలను తట్టుకునే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 78 మంది రక్తదానం చేశారని, సుమారు 78 యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందని, తమ ట్రస్టు తరపున రాబోయే రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. రక్తదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన దాతలులకు, రక్తదానం చేసిన యువకులు, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ అచ్చం నాయుడు, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పోలా రావు, తాతబాబు, చేయూత వారియర్స్ ట్రస్ట్ సభ్యులు, ఈరెల్లి రాజేష్, ఇండుగ శేఖర్, ఇమ్మంది మో, కిమ్ముడు బిలాస్కర్, సాగిన జగన్, రెడ్ క్రాస్ సభ్యులు పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img