Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం… సంక్షేమాభివృద్ధిని కొనసాగించుకుందాం

పాడేరు ఎమ్మెల్యే అరకు ఎంపీ స్థానాలలో వైకాపా అభ్యర్థులను గెలిపించుకుందాం.. ఎంపీపీ అనూష దేవి,

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమాభివృద్ధిని కొనసాగించుకుందామని ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. సోమవారం వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలతలతో కలిసి మండలంలోని కిటుముల పంచాయితీలో శీకాయ బంద, భీముని చట్రు, ములసల బంద, తోట మామిడి, రాచ పనుకు, పలడ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమాలను రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించాల్సిన సామాజిక పింఛనును మూడు వేలకు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకానొకప్పుడు తమ కుటుంబాలలో వృద్ధులు ఉంటే చీదరించుకునే స్థాయి నుండి నేడు తమ కుటుంబంలో వృద్ధులు ఉంటే బాగుండు అనే స్థాయికి ప్రజల ఆలోచనలు మార్చిన ప్రభుత్వం వైకాపా అన్నారు. ప్రాణభయంతో రోజులు లెక్కపెట్టుకుంటున్న డయాలసిస్, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు వారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ నేనున్నాను అంటూ వెన్ను దన్నుగా నిలిచిన గొప్ప ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 45 ఏళ్లు నిండి దారిద్య రేఖకు దిగువన ఉన్న మహిళామూర్తుల ఆర్థిక బలోపేతానికై ఏడాదికి 18 వేల 750 రూపాయలు అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించిన అన్న జగనన్న అన్నారు. రైతుల పక్షపాతిగా నిలిచి రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రైతు భరోసా అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసిన ప్రభుత్వం వైకాపా అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగాలంటే మరల వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రై కార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, కిటుముల ఎంపీటీసీ వనుము పద్మ, వనుము పోతురాజు, సుర్ల అప్పారావు, రావుల నూకరాజు, మర్రి సుందర్రావు, కొర్ర సన్యాసిరావు, నేగుల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img