Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మనిషి జీవితంలో క్రీడలది కీలక పాత్ర

ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి పోటీల ప్రారంభోత్సవంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మనిషి జీవితంలో ఆటలు కీలక పాత్ర పోషిస్తాయని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీపీ అనూష దేవి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీడీవో ఆశాజ్యోతి లతో కలిసి బుధవారం ఆమె ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్య ప్రాంతంలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని, గిరి యువకులు తరచూ వాలీబాల్ ఆడడం చూస్తున్నామని, ఎంతో ప్రతిభావంతులుగా ఉన్నప్పటికీ వారు గ్రామాలకే పరిమితం అవుతున్నారని, అటువంటి వారు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదిక అవుతుందన్నారు. మండలంలోని సచివాలయాల పరిధిలో 108 జట్లు క్రీడల్లో పాల్గొనడం మంచి పరిణామం అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుచుకునేందుకు ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ, సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి 88 జట్లు ఎంపికయ్యాయన్నారు. ఫిజికల్ డైరెక్టర్స్ సూచనలను సలహాలతో క్రీడాకారులు అద్భుతంగా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ విధమైన ఆలోచన చేయలేదన్నారు. గెలుపోటములు సహజమని వాటిని ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. అథ్లెటిక్స్ లో బైరాగి నాయుడు పథకాలు సాధించారని, అంథుల క్రీడాకారిణి రవళి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలలో పథకాల సాధించారని వీరంతా మన గిరిజన జాతి ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలోనూ బయటకు కనబడని ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీసే అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా వెలికి తీయాలన్నారు. మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి పథకాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ రాజులమ్మ, వైస్ ఎంపీపీ గోపినాయక్, ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, శారద, పార్టీ మండల అధ్యక్షులు మోరి రవి, మండల కన్వీనర్ పాంగి గుణబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, కో ఆప్షన్ సభ్యులు నాజర్ వలి, కొయ్యూరు వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ, ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి, సర్పంచ్ లు లోతా పండయ్య సలిమితి. లక్షయ్య, నాయకులు, కార్యకర్తలు ,మండల అధికారులు, 0పీ ఈ టీ లు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img