Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జర్నలిస్టు లపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

రెచ్చగొట్టే ప్రసంగాలతో ఫోర్త్ ఎస్టేట్ కు పొంచివున్న ప్రమాదం

పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పిలుపు.

చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సతీష్.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- జర్నలిస్టు లపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏ పీ యూ డబ్ల్యు జే చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి. సత్యనారాయణ (సతీష్ ) అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అనంత పురం జిల్లా రాప్తాడు లో నిర్వహించిన సిద్దం బహిరంగ సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆ పార్టీ శ్రేణులు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపర్చడం అమానుష చర్య అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్ట్ లపై జరిగిన ఈ దాడికి వైకాపా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. జనం కోసం, జగం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించి అటు పాలకులు, ఇటు ప్రజలకు మధ్య వారదులుగా సేవ చేస్తున్న పాత్రికేయులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. కుల మతాలు, రాజకీయ పార్టీలకతీతంగా ప్రతీ వార్తను కవర్ చేసే పాత్రికేయుల పట్ల ఏ ఒక్కరూ దాడికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు ఈ విధంగా దాడులకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాప్తాడు లో చోటు చేసుకున్న సంఘటన లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, మేదావులు, ఫోర్త్ ఎస్టేట్ పై గౌరవం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇటువంటి దాడులను, దాడులను ప్రోత్సహించే విధంగా నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడాన్ని ప్రతీ ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img