Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మన్యంలో దట్టంగా కమ్ముకున్న మంచు..

దైనందిన కార్యకలాపాలకు ఇబ్బంది పడుతున్న మహిళలు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్య ప్రాంతంలో శీతల గాలులు వీయడంతో పాటు మంచు దట్టంగా కమ్ముకోవడంతో దైనందిన కార్యకలాపాలకు ఈ ప్రాంతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతానికి వెళ్లి ఊటనీరు తెచ్చుకునే గిరి మహిళలు ఒకవైపు ఉంచాలి మరో వైపు దట్టంగా కమ్ముకుని కురుస్తున్న మంచు కారణంగా ఎదురుగా ఉన్న వారు సైతం కనిపించని మంచు దుప్పట్లో మన్య ప్రాంతం ఉంది. దీంతో ఉదయం 11 గంటల వరకు సూర్య భగవానుడు మంచు తెరలను ఛేదించుకుని బయటకు కనిపించని పరిస్థితి. అయినప్పటికీ మన్య ప్రాంతంలో ప్రజలు సమయానుకూలంగా దైనందిన కార్యక్రమాలు చేసుకోక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో శీతల వాతావరణం, మంచు దుప్పట్లో మన్య ప్రాంతం గజగజ వణుకుతున్నప్పటికీ గిరి మహిళలు సుదూర ప్రాంతంలో ఉన్న ఊట గెడ్డలకు వెళ్లి త్రాగునీరు తెచ్చుకుంటున్న దృశ్యం విశాలాంధ్ర కెమెరాకు చిక్కింది. ఈ ప్రాంతంలో పరిస్థితి ఈ విధంగా ఉండగా పర్యాటక ప్రియులు మాత్రం మన్యప్రాంత వాతావరణంలో ఆస్వాదించేందుకు మన్య ప్రాంతానికి క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం సాయంత్రం నుండే ఆంధ్ర కశ్మీర్ లంబసింగి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి మొదలైంది. సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవు రావడంతో పర్యాటకులు ఆంధ్ర కశ్మీర్ తో పాటు మన్య ప్రాంతంలోని మిగిలిన పర్యాటక ప్రాంతాలకు పోటెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img