Monday, May 20, 2024
Monday, May 20, 2024

చోడవరం జనసేన ఇన్చార్జిపై జనసైనికుల ఫైర్ ….

– ఇన్చార్జిగా పీ.వీ.ఎస్.ఎన్. రాజుని తప్పించాలి …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.03.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి పి వి.ఎస్.ఎన్. రాజు వ్యవహార శైలిపై బుచ్చయ్యపేట మండలం (వడ్డాది) జనసేన నేతలు మండిపదుతున్నారు. మండలంలోని వడ్డాదిలో బుదవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన మండల కార్యదర్శి సయ్యపురెడ్డి నవీన్ తదితరులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ భవిష్యత్తు కోసం తాము ఆర్థికంగా నష్టపోయి, పార్టీ కోసమే పని చేస్తున్నామన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గా పీ వీ.ఎస్.ఎన్. రాజు అందర్నీ కలుపుకు పోవడం లేదన్నారు. జనసేన, టి.డి.పి., బి.జె.పి.ఉమ్మడి కూటమి సమావేశాలకి తమను పిలవడం లేదన్నారు. కూటమి పొత్తుల ధర్మానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. విలువ లేని జన సైనికులుగా తాము ఉండలేమని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం తాము నేరుగా చోడవరం టిడిపి,vజనసేన,vబిజెపి ఉమ్మడి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్. రాజును కలిసినా, పత్రికా ముఖంగా ఆయనకి శుభాకాంక్షలు తెలిపినా తమ పార్టీ ఇంచార్జి రాజుకి నచ్చడం లేదన్నారు. తనను అకారణంగా దూషించారన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా లేని విధంగా, సర్పంచి పదవికి, 11 వార్డుల్లోనూ అభ్యర్థులను జనసేన తరపున పోటీ పెట్టి, తమ సొంత ఖర్చులతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమకు విలువ ఇవ్వడం లేదన్నారు. ఇన్చార్జిగా పి.వి ఎస్ ఎన్. రాజుని తప్పించాలని, పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అదే వ్యక్తిని ఇన్చార్జిగా కొనసాగిస్తే, చోడవరం నియోజవర్గంలో జనసేన పార్టీకి భవిష్యత్తు ఉండదన్నారు. పార్టీ అధిష్టానం పెద్దలు స్పందించకపోతే తాము కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జనసేన జడ్పిటిసి అభ్యర్థి మందపాక బాబురావు, మండల సహాయ కార్యదర్శి సయ్యపురెడ్డి జనార్దన్, బోబ్బాది మాణీలు, నాలం వరహాలు,అరిసింగల వాసు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img