Friday, May 31, 2024
Friday, May 31, 2024

ఈ నెల 13న కార్మికులకు సెలవు ….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన వివిధ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు చోడవరం ప్రాంతీయ సహాయ కార్మిక శాఖ అధికారి పి. సూర్యనారాయణ తెలిపారు. వివిధ వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల్లో పనిచేసే వారు కార్మిక సంస్థల్లోనూ హోటల్స్, ఆటోమొబైల్ మెకానిక్ దుకాణాల్లోనూ పనిచేసేవారు కూడా ఆ రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు అన్నారు. యజమానులు ఎవరైనా పోలింగ్ రోజున తమ సంస్థలో పనిచేసే కార్మికులకు సెలవు ఇవ్వకపోయినా, సెలవు ఇచ్చి వేతనం ఇవ్వకపోయినా అట్టి యజమానికి జరిమానతో పాటు, శిక్ష,కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోపరుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు తమను సంప్రదించవచ్చన్నరు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img