Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ప్రభుత్వ ఫించన్లు కు పడిగాపులే ….

-మండుటెండలో బ్యాంక్ సీ.ఎస్సీల వద్ద పండుటాకులు ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రభుత్వ పింఛన్లకు మూడవ తేది వచ్చినా బ్యాంకులు, సీ. ఎస్సీ(కస్టమర్ సర్వస్ సెంటర్) దగ్గర మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవలసిన అధికారిక అనాలోచిత నిర్ణయాల కారణంగా మండు టెండల్లో వృద్దులు, దీర్ఘకాలిక రోగులు ఆశ తో ఎదురుచూస్తున్నారు. పింఛన్ల పై రాజకీయ పార్టీల తగాదా వృద్దుల ప్రాణం మీదకు తెచ్చిన ట్లయింది. ఉన్నతాధికారులు సమాలోచన చేసి తీసుకోవలసిన అధికారిక నిర్ణయాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆరు పదులు దాటిన వృద్దులను అరవై ఆరు సార్లు కాళ్లరిగేలా తిప్పుతున్నారు. మహా వేడి, మండుటెండలో ప్రాణాలు పోతే ఎవరు దిక్కు అని ప్రశ్నిస్తున్నారు. ఫించన్ దారులు హఠాత్ మరణం, వడదెబ్బకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img