Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రైల్వే స్టేషన్ రహదారి…. మురుగు నీటి మయం

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని నందలపాడు, రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిలో ఉన్న బుగ్గ టు అనంతపురం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాల సమీపంలోని భూగర్భ డ్రైనేజీ రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారి మురుగు నీటిమయం అవుతోంది. దీంతో రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణికులు, ఆ ప్రాంతంలో నిశించే ప్రజలు, దేవాలయాలకు వచ్చే భక్తులకు ముక్కు దులాలు పగిలే విధంగా మురుగు నీటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా మురుగునీరు నిలబడిన ప్రాంతంలో చాలా రోజులు మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు వచ్చి ప్రజలు అనారోగ్య పాలై ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే విధంగా మురుగునీరు నిల్వ ఉంటుందని వాపోతున్నారు. ఈ ప్రాంతం లో వర్షం వచ్చిందంటే మురుగునీరు, వర్షపు నీరు రెండు ఏకమై ఒక కుంటల ఏర్పడి చాలా రోజులు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తుంద న్నారు. గతంలో పలుమార్లు మురుగు నీటి సమస్యపై పలు పత్రికలలో ప్రచురించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో మురుగు నీటిలో మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఇంత చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం తూతు మంత్రంగా మురుగునీటి సమస్య పరిష్కరిస్తున్నారు. కానీ రోడ్డుపై మురుగునీరు పారకుండా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని పలువురు ప్రజలు మాట్లాడుకుంటు న్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ రహదారి మురుగునీరు పారుతున్న ప్రాంతం సమీపంలో సచివాలయం ఉంది. సచివాలయంలో ఉన్న మౌలిక సదుపాయాల అధికారి ఏ మాత్రం పట్టించుకోకపోవడం నిద్రవస్థకు నిదర్శనం అన్నారు. కావున ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై పారుతున్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img