Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

24 ద్విచక్ర వాహనాలు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ స్వాధీనం

  • వీటి విలువ మొత్తం రూ. 21 లక్షలు
  • అరెస్టు చేసిన అనంతపురం సిసిఎస్ & టూటౌన్ పోలీసులు..
    విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : 24 ద్విచక్ర వాహనాలు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ స్వాధీనం.
    వీటి విలువ మొత్తం రూ. 21 లక్షలు చేయగా వీరిని అరెస్టు చేసిన అనంతపురం సిసిఎస్ & టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ గురువారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంతపురం సిసిఎస్, టూ టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా వీరితోపాటు ఇద్దరు మైనర్లను జేజే బోర్డు ముందు హాజరు పరచడం జరిగిందన్నారు. వీరి దగ్గర నుంచి 24 ద్విచక్ర వాహనాలు, ట్రాలీ తో కూడిన ట్రాక్టర్, వీటి విలువ రూ.21 లక్షలు ఉందన్నారు.
    ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురు నిందితులు మరియు ఇద్దరు మైనర్లు మంచి స్నేహితులు. వీరికి తాగుడు, తదితర వ్యసనాల అలవాట్లు ఉన్నాయి. జల్సాలకు బానిసలైన వీరు వాహనాల చోరీలకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఐదుగురు కలసి ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక ఆర్టీసీ బస్టాండు, జిల్లా సర్వజన ఆసుపత్రి, తదితర రద్దీ ప్రాంతాలకు వెళ్లడం… అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తారు. ద్విచక్ర వాహనం పార్క్ చేసిన వ్యక్తిని అనుసరించడం, చుట్టూ పరిస్థితులను పరిశీలించడం, అనువైన సమయంలో నకిలీ తాళాల సహాయంతో ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తారు. ఇలా దొంగలించిన వాహనాలను నరేష్ తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్మును అందరూ జల్సాలకు వినియోగించారు. గత ఏడాదిన్నర కాలంలో అనంతపురం 2 టౌన్ , 3 టౌన్ , తాడిపత్రి, ధర్మవరం, బత్తలపల్లి, కర్నాటక రాష్ట్రం బళ్లారి, సింధనూరు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేశారు. వీటితో పాటు నాలుగు రోజుల కిందట నల్లచెర్వు మండల కేంద్రంలో ట్రాలీతో కూడిన ట్రాక్టర్ ను దొంగలించి కళ్యాణదుర్గంలో తక్కువ ధరకే విక్రయించారు. వాహనాల దొంగతనాల కోసం ఎక్కడికి వెళ్లాలనుకున్నా వీరు అద్దె కారును ఉపయోగించారు.
    అనంతపురం సిసిఎస్ & టూటౌన్ సి.ఐ లు ఇస్మాయిల్, వెంకటేష్ నాయక్, జనార్ధన్, క్రాంతికుమార్ … ఎస్సై శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ బయ్యన్న, శ్రీనివాస్, తిరుమలేష్, కానిస్టేబుళ్లు రంజిత్, శ్రీధర్ ఫణి, వన్నూరు, దాస్ , ఆసిఫ్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి రాబడిన సమాచారంతో వీరిని ఫంగల్ రోడ్డు సమీపంలో ఈరోజు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఈ పోలీసు బృందాలను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img