Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

ప్రతిష్టాత్మకంగా పరీక్షలను నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని, పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి – 2024పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి – 2024 పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ఈనెల 2వ తేదీన శుక్రవారం ఎథిక్స్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాలన్నారు. అలాగే ఈనెల 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ స్టడీ ఎగ్జామినేషన్ ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాలన్నారు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు (ఒకేషనల్) నిర్వహించాలని, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు (జనరల్) ప్రాక్టికల్స్ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు. థియరీ ఎగ్జామినేషన్ ను మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ లను 70 కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఒకేషనల్ పరీక్షలను జిల్లాలోని 20 జూనియర్ కళాశాలలో నిర్వహించాలని, థియరీ పరీక్షలను జిల్లాలోని 58 కేంద్రాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 24,446 మంది పరీక్షలకు హాజరవుతారని, అందులో జనరల్ విద్యార్థులు 22,378 మంది, ఒకేషనల్ 2,068 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు 17,110 మంది పరీక్షలకు హాజరవుతారని, అందులో జనరల్ విద్యార్థులు 15,992 మంది, ఒకేషనల్ 1,118 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు. మొత్తం మొదటి, రెండవ సంవత్సరం కలిపి 41,556 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు 100 మీటర్లలోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఒక నర్సును ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ఎవరు సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మకుండా పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షల కన్వీనర్ మరియు డివిఈవో ఎం.వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అనంతపురం ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (నెంబర్ 08554-274256) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా హాల్ టికెట్లు మంజూరు చేయాలని, ప్రాక్టికల్ పరీక్షల కోసం ప్రత్యేక రుసుము వసూలు చేయరాదన్నారు. అలా ప్రత్యేక రుసుము వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో డిఈఓ నాగరాజు, జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్లు డి.శంకరయ్య, ఎన్ఎండి షఫీ, డి. జగన్నాథ్, పోస్టల్ శాఖ పిఆర్ఐ పి. ప్రమోద్ కుమార్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ డిఈఈ నాగేంద్ర, ఏపీఎస్ఆర్టీసీ డిఎం నాగభూపాల్, మెడికల్ అండ్ హెల్త్ డిఎన్ఓ సుజాత, లేబర్ డిసిఓ లక్ష్మీ నరసయ్య, ఎస్డిపిఓ ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img