Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

చిరుధాన్యాల పంటలకు అనంత జిల్లా పుట్టినిల్లు

చిరుధాన్యాల పంటలకు పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ
చిన్నపిల్లలు ఎదగాలి అంటే మంచి ఆహారం కావాలి

ఆర్డిటి డైరెక్టర్ మాంచో ఫెర్రర్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : 60 సంవత్సరాల కిందట మనం పండించే పంటలు చిరుధాన్యాల ఆహారాన్ని తీసుకుంటూ అప్పటి ప్రజలు ఆరోగ్యకరంగా ఉండే వాళ్లని ఆర్డిటి డైరెక్టర్ మాంచో ఫెర్రర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న అనంత చిరుధాన్యాల పండగ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ డి టి డైరెక్టర్ మాంచో ఫెర్రర్, అనంత మేయర్ వసీం, ప్రకృతి వనం ప్రసాద్, ఏంకాలజీ సెంటర్ డైరెక్టర్ వై వి మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పతంగి రాంబాబు, సీసీడి డైరెక్టర్ త్రిలోచనాశాస్త్రి, వ్యవసాయ క్షేత్ర ప్రిన్సిపల్ సహదేవరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చిరుధాన్యాలు పండిస్తూ వాటి ఉత్పత్తులను శని ఆది, సోమ మూడు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారు తయారుచేసిన చిరుధాన్యాల ఉత్పత్తులను అమ్మడం జరుగుతుందన్నారు. చిరుధాన్యాలకు పుట్టినిల్లు అనంత జిల్లా అని వారు పేర్కొన్నారు. ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ అన్నారు. చిన్నపిల్లల ఎదగాలంటే వారికి చిరుధాన్యాల తో చేసినటువంటి ఆహారాన్ని అందించాలన్నారు. కరువు ప్రాంతాలను తట్టుకునే శక్తి ఒక చిరుధాన్యాల పంటలకే ఉందని వారి పేర్కొన్నారు. వర్ష ఆధార రైతులకు అనంత జిల్లాలో పండించాలంటే ఏకైక అవకాశం చిరుధాన్యాలు, పప్పు దినుసులు అని వారు పేర్కొన్నారు. వాతావరణం లో మార్పులు వస్తున్నాయని, ఋతువులు గడి తప్పుతున్నాయని వారు పేర్కొన్నారు. చిరుధాన్యాలు గడ్డి పంటలని దీని పండించుకున్నట్లయితే భూమి సారవంతమవుతుందన్నారు. చిరుధాన్యాలను శుద్ధి చేయడంలో పండించే రైతులు వాటాదారులుగా సంస్థలు ఏర్పడాలన్నారు. అంతర్జాతీయ సదస్సులో కూడా చిరుధాన్యాల పంటలపై వాటి ఉత్పత్తుల గురించి పరిశోధనల దిశగా అడుగులు వేస్తున్నాయి అన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైనా చిరుధాన్యాలతో చేసిన వంటకాలను తీసుకునే విధంగా అలవాటు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. సాంస్కృతి కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ఉపయోగాలపై పాటలు, కోలాటాలు, అవగాహన నాటికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కాలజీ సెంటర్, ఆర్ డి టీ ట్రస్ట్,ఏ పి ఎం ఎస్, జన జాగృతి, ఫర్మ్ వేద, మిల్లెట్ మ్యాజిక్, అనంత న్యాచురల్, స్వచ్ఛ కాద్యమ్, పి ఏ ఎస్ ఎస్, కార్డు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img