Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన వార్షిక క్రీడా దినోత్సవం వేడుకలు

కరెస్పాండెంట్ శెట్టిపి నిర్మల జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, పాల్గొన్నారు. తదుపరి ముఖ్య అతిథుల చేత జాతీయ పతాక ఆవిష్కరణ, పాఠశాల పతాక ఆవిష్కరణ క్రీడల ఆవిష్కరణ నిర్వహించారు. క్రీడాకారులతో కలిసి స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని, క్రీడల్లో రాణించడం వల్ల విద్యార్థులలో శారీరక మానసిక, పోటీ తత్వం పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో మంచి ప్రతిభను ఘనపరిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పాఠశాల విద్యార్థులు చేసిన పలు క్రీడా విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు, క్రీడాకారులకు, మెమొంటోలు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. తదుపరి 2023-24 లో యూకేజీ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శెట్టిపి నిర్మల జయచంద్రారెడ్డి, డైరెక్టర్ శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి, శెట్టిపి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img