Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనెల 10వ తేదీన “అనంత”కు సుప్రీంకోర్టు జడ్జిల రాక

. ఎలాంటి లోటుపాట్లు జరగరాదు
. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈనెల 10వ తేదీన జిల్లాకు సుప్రీంకోర్టు జడ్జిలు రానున్నారని, ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రోటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 10వ తేదీన అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించే వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన శనివారం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్ కార్యక్రమంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జి గౌరవ జస్టిస్ అశానుద్దీన్ అమానుల్లా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. అలాగే గౌరవ అతిథులుగా న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జి గౌరవ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జి గౌరవ జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చైర్మన్ & సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా హాజరుకానున్నరన్నారు. అలాగే ఆరు మంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హాజరవుతారన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జిలు జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. . ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, మున్సిపల్ కమిషనర్ మేఘ స్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏ.రామిరెడ్డి, అడ్వకేట్లు హరినాథ్ రెడ్డి, నరసింహులు, అనంతపురం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రాణి సుస్మిత, డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, వెంకటనారాయణమ్మ, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, డ్వామా పీడి వేణుగోపాల్ రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఐ&పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, డిటిసి వీర్రాజు, ఆర్.అండ్.బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img