Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి…

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 చెల్లించాలి …

ఏపీ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. నాగవేణి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేల రూపాయల వేతనం చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. నాగవేణి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆశా వర్కర్లపై అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలన్నారు. పనిచేయని సెల్ ఫోన్లు మాకు అవసరం లేదని ఆశ వర్కర్లతో సంబంధంలేని పనులు చేయించరాదన్నారు. జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా టీబీ, లెప్రసీ బకాయిలను వెంటనే చెల్లించాలని, నాణ్యమైన యూనిఫామ్ ఆశలకి ఇవ్వాలన్నారు. ఉచిత ప్రమాద బీమా 10 లక్షలు ఆశాలకు ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ తో పాటు ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ వర్తింపుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సెలవులు, మెడికల్ లీవులు మంజూరు చేయాలన్నారు. ఆశా వర్కర్లు అనేక సమస్యలతో సతమవుతమవుతున్నారని పని భారం పెరుగుతుందే తప్ప పనికి తగ్గ వేతనం లేదని ఆవేదన చెందారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. కలెక్టరేట్ ఎదురుగా ధర్నా ఉధృతం చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img