Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

టెండర్లు రద్దు చేయాలని ఆందోళన

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఈనెల 18వ తేదీన నిర్వహించిన తల నీలాలు, కొబ్బరికాయలకు సంబంధించిన టెండర్లలో అవకతవకులు జరిగాయని వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ వేలంపాటదారులు శుక్రవారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేలం పాటల్లో పాల్గొన్న టెండర్ల దారులు మాట్లాడుతూ తల నీలాలు రూ,52,0500 లక్షల రూపాయలకు, మరియు కొబ్బరికాయల వేలం రూ,23,07000 లక్షలకు పుల్లయ్య అనే వ్యక్తి టెండర్లను హెచ్చు పాట పాడి దక్కించుకోవడం జరిగిందని. అయితే ఎవరైతే టెండర్లను దక్కించుకున్నారో వారు పాడిన పాటలో 50% మొత్తాన్ని అదే రోజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ పుల్లయ్య చెల్లించలేదని అంతేకాకుండా బ్యాంకు ఖాతాలో కేవలం 30 వేల రూపాయలు మాత్రమే నగదు నిల్వ ఉంచి చెక్కులలో పాటదారుడు 50% నగదు నమోదు చేసి ఈవో కి చెక్కులు అందించడం జరిగిందని అయితే తమకు అనుమానం వచ్చి బ్యాంకు ఖాతా పరిశీలించాలని తాము డిమాండ్ చేశామని ఖాతా పరిశీలించగా కేవలం 30 వేలు మాత్రమే నగదు నిల్వ ఉందని వారు తెలిపారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకించామని 50% డబ్బు వెంటనే చెల్లిస్తే టెండర్లు ఆమోదించాలని లేనిపక్షంలో డిపాల్ట్ చేయాలని డిమాండ్ చేశామని ఈవో కూడా దీనికి అంగీకరించారని అయితే టెండర్లు జరిగి మూడు రోజులు కావస్తున్నప్పటికీ ఈవో టెండర్లను రద్దు చేస్తున్నట్లు గాని డబ్బు చెల్లించని వారిని డిఫాల్ట్ చేస్తున్నట్లుగానే ప్రకటించకుండా ఈవో కాలయాపన చేస్తున్నారని వారు పేర్కొన్నారు. పుల్లయ్యతో ఈవో లాలూచీపడి దేవాదాయ ఆదాయానికి గండి కొడుతున్నాడని పేర్కొన్నారు పెన్నహోబిలం ఆలయ ఈవో పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని నూతన రథం నిర్మాణానికి కూడా భక్తులు అందించిన విరాళాలలో అనేక అవకతకులు జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. జిల్లా ఉన్నత స్థాయి దేవదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈనెల 18వ తేదీన జరిగిన టెండర్లను రద్దుచేసి మరోసారి టెండర్లను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవిన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వేలంపాటిదారులు శ్రీనివాసులు, మారెన్న మణికంఠ, నాని, మహేష్ మీనుగా రమేష్, వీటితోపాటు అనేకమంది ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img