Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వాహనదారులు, ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ విజ్ఞప్తి…

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : భారీ గూడ్స్ వాహనాలు మినహా మిగితా అన్ని రకాల వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, అత్యవసర వాహనాలు యథావిధిగానే అనంతపురం మీదుగా హైవే-44 పై వెళ్లవచ్చు. ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయం పేరున నిన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాము. సదరు ప్రెస్ నోట్ లో బెంగుళూరు నుండీ హైదరాబాద్ వెళ్లే వాహనాలను హైవేపై కాకుండా మామిళ్లపల్లి దగ్గర మళ్లించి నూతిమడుగు, కళ్యాణదుర్గం, అనంతపురంల మీదుగా హైదరాబాద్ వెళ్లాలని… అదేవిధంగా హైదరాబాద్ నుండీ బెంగుళూరు వెళ్లే వాహనాలు అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద మళ్లించి తడకలేరు, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, నార్పల, బత్తలపల్లి, ధర్మవరం,మామిళ్లపల్లిల మీదుగా వెళ్లాలని సూచించాము. ఈ ఆంక్షలు కేవలం భారీ గూడ్స్ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయన్నారు. మిగితా అన్ని రకాల వాహనాలు, అత్యవసర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు యథావిధిగానే అనంతపురం మీదుగానే హైవే-44 పై వెళ్లవచ్చన్నారు. ప్రజలు, వాహనచోదకులు అసౌకర్యానికి గురికాకుండా ఆంక్షలు సవరించామని పోలీసులతో సహకరించాలని ఆయన తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img