Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముందస్తు వర్షాలు… హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ లలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ముందస్తు వర్షాలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది ముంగారు వర్షాలు రైతులను మురిపిస్తున్నాయి. ఖరీఫ్ కు ప్రారంభం ముందే వర్షాలు రావడం రైతుల బతుకుల్లో సంతోషం కనిపిస్తోంది. అటు వ్యవసాయ అధికారులు నాణ్యమైన విత్తనాల పంపిణీకి సిద్ధం కాగా ఇటు అన్నదాతలు కూడా తమ పొలమును దున్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్లో ఏ పంటను ఎంత విస్తీర్ణములో సాగు చేయవచ్చునన్న అంచనాలతో వ్యవసాయ అధికారులు ముందస్తు అంచనాలు కూడా వేసుకుంటున్నారు. గత ఏడాది ఖరీఫ్ తో పోల్చుకుంటే ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరుగుతాయని అధికారులు తెలుపుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు మండలములో అదునుకు తగ్గట్టుగా వర్షాలు కురిసాయని రైతులు తెలుపుతున్నారు. దీంతో రైతులు పొలాలను దుక్కులు చేసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు విత్తనాలను సరఫరా చేశారు. నకిలీ విత్తనాలు లేకుండా నాణ్యమైన ఎరువుల సరఫరాపై కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావరణ శాఖ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలపడంతో ఖరీఫ్ సాగు జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయని రైతులు బాహాటంగా తెలుపుతున్నారు. పంటల ప్రణాళికతో వివరాల ప్రకారం ధర్మవరం నియోజకవర్గంలో అధిక శాతం మంది రైతులు వేరుశనగ కంది పంటలను సాగు చేసుకునే పనుల్లో నిమగ్రిమయ్యారు. గత ఏడాది నియోజకవర్గంలో పండు సాగు వివరాలకు వెళితే (హెక్టార్లలో) ధర్మవరం వేరుశనగ 11,000 హెక్టార్లు, కంది 9వేల హెక్టార్లు, బత్తలపల్లి వేరుశనగ 5000,కంది 3000, తాడిమర్రి వేరుశనగ 9,300, కంది 7,200 ముదిగుబ్బ వేరుశెనగ12,300 హెక్టార్లు, కంది 106 హెక్టార్లు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతో అధికారులు కూడా ఈ సంవత్సరం వేరుశనగ ధరలను ప్రకటించారు. ఇందులో భాగంగా వేరుశనగ క్వింటాల్ పూర్తి ధర రూ.9,500, సబ్సిడీ రూ.3,800 పోను రూ.5,700 చెల్లించాలని అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా సబ్సిడీ పోను ఒక బ్యాగు రూ.1,710 చెల్లించాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. అర ఎకరా లోపు విస్తీర్ణం గల రైతులకు ఒక బ్యాగు అర ఎకరా నుంచి ఒక ఎకరా లోపు విస్తీర్ణం గల రైతులకు రెండు బ్యాగులు ఒక ఎకరం పైన విస్తీర్ణం గల రైతులకు మూడు బ్యాగులు చొప్పున వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మరి ఈ సంవత్సరమైనా రైతులు అధిక దిగుబడి రావాలని ఆ భగవంతుని కోరుకుందాం. రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. వ్యవసాయంలో రైతులు పనిచేయకపోతే ఆహార ధాన్యాలు ఉండనే ఉండమని కొందరు ప్రముఖులు తెలుపుతున్నారు. ప్రభుత్వాలకు కూడా రైతన్నలను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలను పరిష్కరించినప్పుడే అన్నదాత రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందని బాహాటంగా ప్రజలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img