Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నులి పురుగులను నిర్మూలించాలి

జిల్లా కలెక్టర్ యం. గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : చిన్నారుల ఆరోగ్యానికి, వారి ఎదుగుదలకు హానికరంగా మారిన నులిపురుగులను సమూలంగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. గురువారం అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కార్పొరేషన్ మున్సిపల్ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి హాజరై అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లలే దేశ సంపదకు చిహ్నంగా అభివర్ణించారు. విద్యార్థి దశ నుంచి ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1 – 19 సంవత్సరాల వయసున్న అందరు పిల్లలకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కార్యకర్తలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ తరఫున అల్బెండజోల్ మాత్రలను పిల్లలందరికీ మాత్రలను వేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ ఉపయోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, కార్మిక సంఘం ప్రతినిధి చవ్వా రాజశేఖర్ రెడ్డి, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ యుగంధర్, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డిఈఓ సాయిరాం, ఆర్ఐఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img