Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రజా సమస్యలను ప్రతి కౌన్సిలర్ పరిష్కరించే విధంగా కృషి చేయాలి…

మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రజా సమస్యలను ప్రతి వార్డ్ కౌన్సిలర్ పరిష్కరించే విధంగా కృషి చేయాలని, ఇందుకు తన వంతుగా పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయములోని కౌన్సిల్ సమావేశమును నిర్వహించారు. తదుపరి అజెండాలోని 45 అంశాలు టేబుల్ అజెండాలోని 26 అంశాలను చదివి వినిపించారు. అనంతరం ఈ అంశాల మీద కౌన్సిలర్లు అందరూ కూడా తమ తీర్మానాన్ని ఆమోదించారు. తదుపరి కౌన్సిలర్లు బ్రహ్మయ్య ఆచారి, మేడాపురం వెంకటేష్,మాసపల్లి సాయికుమార్ తదితరులు మాట్లాడుతూ పట్టణంలోని కొన్ని వాటిల్లో ముళ్ళకంపలు అధికమయ్యాయని వాటిని వెంటనే తొలగించాలని తెలిపారు. అదేవిధంగా పట్టణములో అతి ముఖ్యమైన పనులకు జెసిబి యంత్రాన్ని బాడుగకు తీసుకోవడం సరికాదని, దీనివల్ల లక్షల్లో ప్రజాధనం వృధా అవుతుందని, మున్సిపాలిటీకి సొంతంగా జెసిబిను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇప్పటికే ఇల్లు లేని వారికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇందులో ఇంటి నిర్మాణంలో చాలామందికి బిల్లులు పడటం లేదని, వెంటనే బిల్లులు తెప్పించితే పూర్తి నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. తదుపరి అన్ని వార్డులలో కూడా వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ప్రస్తుతం 500 ట్యూబ్ లైట్లు వచ్చాయని, వాటిని వెంటనే వార్డ్ వారిగా పంపిణీ చేస్తామని తెలిపారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి సమస్యను త్వరితగతంగా పరిష్కరిస్తారని వారు హామీ ఇచ్చారు. మునిసిపల్ అధికారులు కూడా వార్డు కౌన్సిలర్ల యొక్క సమస్యలను పరిష్కరించే దిశలో పాటుపడాలని తెలిపారు. తదుపరి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం ను వాలంటీర్లు ఇంటింటా వెళ్లి సమస్యలను తెలుసుకుంటారని, ఈ సమస్యలను పరిష్కరించుటలో ప్రతి వార్డు కౌన్సిలర్లు తమ సహాయ సహకారాలను అందిస్తూ, పరిష్కరించితే తప్పక విజయం చేకూరుతుందని, తద్వారా ఎమ్మెల్యే కేతిరెడ్డికి, ధర్మారం మున్సిపాలిటీకి మంచి గుర్తింపు లభిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మేనేజర్ ఆనంద్ కుమార్, మున్సిపల్ ఈ ఈ, డి ఈ, ఏఈలు, శాంట్రీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు.. భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, మాసపల్లి సాయికుమార్, కో ఆప్షన్ నెంబర్ భూశెట్టి రామకృష్ణ, పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img