Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రైతు సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలి

దేశానికే అన్నం పెట్టే రైతులకు మద్దతు ఇవ్వని ప్రభుత్వాలు
తాసిల్దార్ కార్యాలయం ముందు సామూహిక దీక్ష
మద్దతు తెలిపిన జనసేన తెలుగుదేశం ప్రజా సంఘాలు

విశాలాంధ్ర – తనకల్లు : రైతు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తాసిల్దార్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్ష కార్యక్రమంలో భాగంగా తన మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం ఆర్డర్ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీరైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య జిల్లా కార్యదర్శి జే.వి. రమణ సహాయ కార్యదర్శి మధు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సోంపాలెం నాగభూషణం గిరిధర్ నాయుడు, స్వామితోపాటు జనసేన బాలసముద్రం ఎంపీటీసీ అమర కార్తికేయ మండల కార్యదర్శి రమణ దీక్ష శిబిరంలో కూర్చుని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల మొదలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని తర్వాత రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వాలు వెన్నుపోటు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాజంలో దొరికే ప్రతి వస్తువుకు కంపెనీలతో పాటు ఇతరులు ధర నిర్ణయిస్తారని రైతు పండించే పంటకు రైతులు ధరను నిర్ణయించుకునే పద్ధతిని ఎందుకు తీసుకురాకూడదు ప్రభుత్వాలు సమాధానం చెప్పాలన్నారు ఉచిత కరెంటు అందిస్తామన్న ప్రభుత్వాలు బోరు మోటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెడుతున్నాయో రైతులు ప్రశ్నించి ఎదుర్కొన్న నాడే వారు రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు వెల్లడవుతాయన్నారు గడచిన నాలుగు సంవత్సరాలలో రైతులకు ప్రభుత్వాలు చేసిన మేలు ఏమిటో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు జిల్లా కార్యదర్శి జేవి రమణ మాట్లాడుతూ రైతులను మభ్యపెడుతూ ఓట్లు దండుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని మోసం చేస్తున్నారని మన సమస్యలపై మనమే పోరాడి సాధించుకోవాల్సి వస్తుందని కానీ పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనే నిదానంతో ప్రతి రైతు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ఇతర రాష్ట్రాల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద పదివేల రూపాయలు అందిస్తున్నారు విషయం గుర్తు చేసుకోవాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి 13 వేల రూపాయలు అందిస్తున్నారని ఇతర ఏ కార్యక్రమం అయినా రైతుల కోసం జరుగుతుందేమో తెలపాలన్నారు రైతు భరోసా కేంద్రాల్లో రైతుల పేర్లు నమోదు తప్ప ఏ ఒక్క ఎరువు పురుగుమందులు కానీ రైతు పండించిన పంటలు అమ్మకం కొనడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏమీ జరగడం లేదన్నారు రైతు సంక్షేమమే ధ్యేయం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు హామీలకే పరిమితమయ్యాయి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరహాలో ప్రతి ఎకరాకు సాగు సహాయం పదివేల రూపాయలు ఇవ్వాలని, దేశంలో రైతులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారని రైతు వ్యవసాయం ముందుకు సాగాలి అంటే రుణమాఫీ చేయాలని,ఉపాధి హామీ పథకాన్ని రైతు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని,స్వామినాథ కమిషన్ చెప్పినట్టు రైతుకు గ్యారెంటీ మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని,వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ వెనక్కి తీసుకోవాలని,50 సంవత్సరాలు పైబడిన రైతులకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని,అన్ని రకాల ఎరువులు విత్తనాలు పురుగుమందులు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని,చిన్న సన్నకారు రైతు కౌలు రైతులు రుణభారం అధికమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ లను అమలుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ అధ్యక్షులు చౌడప్ప యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప నాయకులు చలపతి శ్రీనివాసులు రవీంద్ర నాయక్ రెడ్డప్ప సోమశేఖర చౌడప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img