Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భారతీయ సంస్కృతిని కాపాడాలి

నా భూమి-నా దేశం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుని దేశభక్తిని చాటి చెప్పాలి

: జిల్లా కలెక్టర్ యం. గౌతమి

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అను నినాదంతో వసుధకు వందనం కింద శుక్రవారం అనంతపురం రూరల్ పరిధిలోగల ప్రసన్నాయనపల్లి గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నేలతల్లికి నమస్కారం, వీరులకు వందనం కార్యక్రమంలో పీఆర్ డ ఆర్డీ కమిషనర్ ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ యం. గౌతమి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నా భూమి నా దేశం శిలాఫలకం ఆవిష్కరించి, రైన్ వాటర్ రూఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ని ప్రారంభించి వసుధకు వందనం కింద మొక్కలు నాటారు. అనంతరం జాతీయ పథకాన్ని వారు ఆవిష్కరించారు. ఆ తర్వాత పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు.
లిఈ సందర్భంగా పీఆర్ డ ఆర్డీ కమిషనర్ ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ నా భూమి-నా దేశం అను నినాదంతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని విద్యార్థులు ప్రతిరోజు చూడాలని, దాంతో వారు నిత్యం ఏం చేయాలో అవగతమవుతుందన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులు కాపాడాలన్నారు. విద్యార్థులు ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించరాదని, మొక్కలు పెంచాలని, పెద్దలను గౌరవించాలన్నారు.
లిఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యం.గౌతమి మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అను నినాదంతో ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలోనూ త్రివర్ణ పథకాలను ఎగురవేస్తూ, స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్మరిస్తూ, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పలు కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తూ, పంచ ప్రాణ్ ప్రతిజ్ఞ చేయడం జరుగుతోందని, వసుధకు వందనంలో ప్రతి పంచాయతీలో 75 పైగా మొక్కలు నాటుతున్నామని, వీరులకు వందనం చేస్తూ, ఆగస్టు 15వతేదీన జాతీయ పథకాన్ని ఎగరవేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. నా భూమి-నా దేశం కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు పాలుపంచుకోవాలని, దేశం పట్ల గౌరవాన్ని, దేశభక్తిని చాటి చెప్పాలన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో చదివిన చాలా మంది ఆర్మీలోకి వెళ్లి సేవ చేశారని ఇది ఎంతో అభినందనీయమన్నారు.
అనంతరం ప్రసన్నాయన పల్లి గ్రామం నుంచి సైన్యంలో ఆర్మీ జవాన్లుగా పనిచేసి రిటైర్డ్ అయిన మధుసూదన్ రావు, వెంకటేష్ ప్రసాద్, రాజారెడ్డి, సుంకిరెడ్డి, తదితర మాజీ జవాన్లను, వారి కుటుంబ సభ్యులను పీఆర్ డ ఆర్డీ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితరులు మెమెంటోలు అందించి శాలువాకప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఈజిఎస్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్, హార్టికల్చర్ జాయింట్ కమిషనర్ అశోక్ కుమార్, హార్టికల్చర్ డిప్యూటీ కమిషనర్ భవాని, ఆర్డీఓ మధుసూదన్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, జడ్పి సిఈఓ భాస్కర్ రెడ్డి, పీఆర్ ఎస్ఈ భాగ్యరాజ్, డీపీఓ విజయ్ కుమార్, డిప్యూటీ సిఈఓ శ్రీనివాసులు, డ్వామా ఏపిడి ఆయేషా, ఈజిఎస్ సూపరింటెండెంట్ శైలజ, ప్లాంటేషన్ మేనేజర్ సునీల్ కుమార్, ప్లాంటేషన్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ, మాజీ ఆర్మీ జవాన్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img