Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏ పి సి యూ లో ఘనంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క విలువలకు పెద్దపీట వేస్తూ బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఇంగ్లీషు తెలుగు విభాగాలు సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్య్రమానికి ఇంగ్లీష్ విభాగం అధ్యక్షులు డా. పరిమళ కమతార్ అధ్యక్షత వహించగా గౌరవ
అతిథిగా ఆంద్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి డీన్ ప్రొఫెసర్ సి శీలారెడ్డి, ముఖ్య అతిథి ప్రొఫెసర్ వివిఎన్ రాజేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు.
డాక్టర్ పరిమళ కామతార్ ప్రారంభోపన్యాసం చేసి, సభకు స్వాగతం పలుకుతూ ఒక దేశం దాని భాష ద్వారానే తయారవుతుందని నొక్కి చెబుతూ, మాతృభాషలను కాపాడుకోవడం ముఖ్యమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ వివిఎన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భాషలు కమ్యూనికేషన్, గుర్తింపు మరియు సాంస్కృతిక వ్యక్తీకరణను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. ప్రతి భాషా ఎంతో విలువైనదని, భాషలు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యతను యువత స్వీకరించాలన్నరు.
డీన్ ఆచార్య సి. షీలారెడ్డి మాట్లాడుతూ…. భాషా శాస్త్రాల శాఖలు సంయుక్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తెలుగు శాఖ అతిథి సహాయాచార్యులు డా. బి. అశోక్ కమార్ మాట్లాడుతూ… భాషా సంస్కృతులు దేశాభివృద్ధిలో చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే వాటి ప్రాధాన్యత మనకు అంతగా కనిపించక పోవచ్చన్నారు. ప్రతి వ్యక్తికి భాష ఒక సాధనమని తన భావోద్వేగాలను, ఆలోచనా భావ తరంగాలను బహిర్గతం చేసుకోవడానికి, సమాజంతో మమేకం కావడానికి బలమైన సాధనంగా ఉపయోగపడేది మాతృభాష ఒక్కటే అని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “నాకు నా మాతృభాష ఏమిటి?” అనే వక్తృత్వ పోటీలను నిర్వహించారు. వక్తృత్వ పోటీలో, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలలో వివిధ మాతృభాషలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img